పెళ్లి తర్వాత నయనతార ప్లాన్ ఇదే.. సినిమాలకు గుడ్ బై ?

pratap reddy   | Asianet News
Published : Sep 10, 2021, 03:03 PM IST
పెళ్లి తర్వాత నయనతార ప్లాన్ ఇదే.. సినిమాలకు గుడ్ బై ?

సారాంశం

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. 

సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ నయనతార క్రేజ్ కూడా పెరుగుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే భామ నయనతార. గ్లామర్ రోల్స్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో నయనతార దూసుకుపోతోంది. 

ఇక నయనతార తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు సౌత్ లో హాట్ టాపిక్. శింబు, ప్రభుదేవా లాంటి నటులతో నయనతార పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేసుకుంది. శింబు ,నయన్ గురించి అప్పట్లో అనేక రూమర్స్ వినిపించాయి. 

వీరిద్దరి వ్యక్తిగత ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇక ప్రభుదేవాతో ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అనుకున్న టైంలో విడిపోయింది. ప్రస్తుతం నయనతార.. యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతో ప్రేమలో ఉంది. 

వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే నయన్, విగ్నేష్ ల పెళ్లి జరగబోతోందని అంటున్నారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే..వివాహం తర్వాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ లోపు నయన్ తాను కమిటై ఉన్న చిత్రాలని ఫినిష్ చేస్తుందట. వివాహం తర్వాత నటన మానేసి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని.. నయన్ పెళ్లి తర్వాత కూడా నటిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. పర్సనల్ లైఫ్ కోసం నయన్ ప్రొఫెషనల్ లైఫ్ ని వదులుకోదని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి