ఎన్ని కోట్లిచ్చినా అతడి పక్కన నటించను.. దిమ్మతిరిగే షాకిచ్చిన నయన్!

Published : Jul 28, 2019, 03:58 PM IST
ఎన్ని కోట్లిచ్చినా అతడి పక్కన నటించను.. దిమ్మతిరిగే షాకిచ్చిన నయన్!

సారాంశం

లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో నయనతార దూసుకుపోతోంది. నయనతార ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. నయనతారకు ఉన్న క్రేజ్ తో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ సమర్పించుకుంటున్నారు నిర్మాతలు.

లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో నయనతార దూసుకుపోతోంది. నయనతార ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్. నయనతారకు ఉన్న క్రేజ్ తో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ సమర్పించుకుంటున్నారు నిర్మాతలు. ఇక డేట్స్ లేకపోతేనో, నయన్ సినిమా చేయడం కష్టమైన పరిస్థితుల్లోనే ఎలాగైనా ఆమెని ఒప్పించడానికి రెమ్యునరేషన్ కంటే ఎక్కువే ఇచ్చి సినిమాలు చేస్తున్న నిర్మాతలు కూడా ఉన్నారు. 

తాజాగా అలా అనుకుని వెళ్లిన ఓ నిర్మాతకు నయన్ ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నైలో శరవణ స్టోర్స్ అధినేతగా శరవణ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శరవణ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఆ చిత్రంలో హీరోయిన్ గా నటింపజేసేందుకు నిర్మాత వెళ్లి నయనతారని సంప్రదించాడట. శరవణ క్రేజ్ లేని నటుడు కాబట్టి ఆ నిర్మాత నయనతారకు 10 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట. కానీ నయనతార మాత్రం ఎన్ని కోట్లిచ్చినా అతడి సరసన నటించానని తేల్చి చెప్పేసినట్లు సమాచారం. నయనతార 10 కోట్ల రెమ్యునరేషన్ వదులుకోవడానికి కారణం ఆ చిత్ర కథ కూడా అనే ప్రచారం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా