నాకు ఒకటి చెప్పి తెరపై మరోలా.. మురుగదాస్ పై నయన్ కామెంట్స్!

Published : May 09, 2019, 10:15 AM IST
నాకు ఒకటి చెప్పి తెరపై మరోలా.. మురుగదాస్ పై నయన్ కామెంట్స్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో మన తారలు నటించే ప్రతీ సినిమా హిట్ అవ్వాలని లేదు. 

సినిమా ఇండస్ట్రీలో మన తారలు నటించే ప్రతీ సినిమా హిట్ అవ్వాలని లేదు. కొన్ని సూపర్ హిట్స్ అవుతుంటే మరికొన్ని ఫ్లాప్స్ అవుతుంటాయి. కొన్ని సార్లు కథల ఎంపిక విషయంలో తప్పు చేశామని రిలీజ్ తరువాత బాధపడుతుంటారు.

సినిమా చేయకుండా ఉంటే బాగుండేది అంటూ లేట్ గా రియలైజ్ అవుతుంటారు. దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఓ సినిమా విషయంలో అలానే ఫీల్ అవుతోంది. తన కెరీర్ లో 'గజిని' సినిమా చేయడం ఒక చెత్త నిర్ణయమని చెప్పింది.

సూర్య హీరోగా నటించిన ఆ సినిమాలో అసిన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. సినిమా తను పోషించిన పాత్రపై నయన్ కొన్ని కామెంట్లు చేసింది. తనకు నెరేషన్ ఇచ్చిన పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా తేడా ఉందని ఆరోపించింది. ఈ సినిమా అనుభవం తరువాత పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడ్డట్లు చెప్పుకొచ్చింది.

మరి దర్శకుడు మురుగదాస్ అలా ఎందుకు చేశాడో.. తను నటించిన 'చంద్రముఖి' సినిమాలో కూడా చిన్న పాత్ర అయినప్పటికీ మంచి పేరు తీసుకొచ్చిందని, అలానే 'శివకాశి' సినిమాలో ఒక పాట మాత్రమే చేసినా.. అది కూడా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?