Nayanthara: నయనతారని ఫిదా చేసిన జాన్వీ కపూర్.. మెసేజ్ పెట్టిన లేడీ సూపర్ స్టార్

By team teluguFirst Published Aug 6, 2022, 4:29 PM IST
Highlights

జాన్వీ అవకాశం వచ్చిన చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ఓటిటిలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

శ్రీదేవిలాగా జాన్వీ కపూర్ అతిలోక సుందరి కాదు. శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది.  బాలీవుడ్ లో గ్లామర్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కుర్రాళ్ల మతులు చెడగొట్టే సోయగాలు జాన్వీ సొంతం కావడంతో ఆమె క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. 

సినిమాల పరంగా కూడా జాన్వీ అవకాశం వచ్చిన చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ఓటిటిలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ నటన నయనతారని విపరీతంగా ఆకట్టుకుందట. జాన్వీ నటనపై నయన్ ప్రశంసలు కురిపించింది. 

లేడీ సూపర్ స్టార్ కి తన నటన నచ్చడంతో ఈ యంగ్ బ్యూటీ సంతోషంతో ఉబ్బి తబ్బిబవుతోంది. దీనితో జాన్వీ కపూర్ స్వయంగా నయనతార నంబర్ తీసుకుని తన సంతోషాన్ని తెలియజేస్తూ మెసేజ్ పెట్టిందట. వెంటనే నయనతార స్పందించి 'గుడ్ లక్ జాన్వీ' అని మెసేజ్ పెట్టినట్లు జాన్వీ తెలిపింది. 

ఈ విధంగా జాన్వీ కపూర్ లేడీ సూపర్ స్టార్ దగ్గర మార్కులు కొట్టేసింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. అంతకు మించి ఫోటోషూట్స్ తో పరువాల ఆరబోతతో కవ్విస్తోంది. జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎప్పటి కప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. 

click me!