కారు ప్రమాదంలో నటికి తీవ్ర గాయాలు.. మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా కోస్టార్

Published : Aug 06, 2022, 03:30 PM IST
కారు ప్రమాదంలో నటికి తీవ్ర గాయాలు.. మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా కోస్టార్

సారాంశం

సినీ తారలు వరుసగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

సినీ తారలు వరుసగా ప్రమాదాలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె వయసు 53 ఏళ్ళు. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతో కలసి అన్నే హెచే నటించారు. 

వీరిద్దరూ క్వాంటికో అనే హాలీవుడ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అన్నే హెచే శుక్రవారం కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్నారు. తన ఇంట్లో బగ్యారేజీ నుంచి మినీ కూపర్ కారుని బయటకు తీశారట. ఆ కారుని డ్రైవ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె ఓ ఇంటిని ఢీ కొట్టారు. 

కారు ఇంజన్ క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి మంటల్ని అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో అన్నే హెచ్చే స్పృహ కోల్పోయారట. 

వైద్యులు చికిత్స అందించడంలో తిరిగి స్పృహలోకి వచ్చారని.. బాగా శ్వాస తీసుకోగలుగుతున్నారని వైద్యులు తెలిపారు. అన్నే హెచేకి ఇక ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అన్నే హెచే హాలీవుడ్ లో సీనియర్ నటి. అనదర్ వరల్డ్ అనే టివి షోతో అన్నే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?