లేడి సూపర్ స్టార్ ఇమేజ్ పోతుందా.. కొత్త చిక్కుల్లో నయనతార!

Published : Jun 20, 2019, 03:20 PM IST
లేడి సూపర్ స్టార్ ఇమేజ్ పోతుందా.. కొత్త చిక్కుల్లో నయనతార!

సారాంశం

సౌత్ లోలేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతారకు సమస్యలు ఏంటని అనుకుంటున్నారా. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. నయనతార సౌత్ లో బాలయ్య లాంటి సీనియర్ హీరోలు, శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోల సరసన ఇట్టాగే ఒదిగిపోయి నటించగలదు. 

సౌత్ లోలేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతారకు సమస్యలు ఏంటని అనుకుంటున్నారా. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. నయనతార సౌత్ లో బాలయ్య లాంటి సీనియర్ హీరోలు, శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోల సరసన ఇట్టాగే ఒదిగిపోయి నటించగలదు. అదే నయనతార ప్రత్యేకత. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా నయనతార దూసుకుపోతోంది. అందుకే నయన్ ని సౌత్ లేడీ సూపర్ స్టార్ అని అంటున్నారు. ప్రస్తుతం నయన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. 

ఇటీవల నయనతార నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. తాను నటించిన కొన్ని చిత్రాలు కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం కూడా నయన్ కు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో తన ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన సమస్యలు కూడా నయనతార మెడకు చుట్టుకుంటున్నాయి. 

శివకార్తికేయన్ సరసన నటించిన మిస్టర్ లోకల్ తో పాటు ఐరా చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా నయన్ నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం నయన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ చిత్రం ఇప్పటికే కోర్టు సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఖామోషి పేరుతో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు చక్రి తోలేటి కావడం నయన్ కు భయం పట్టుకుంది. 

కొలైయుధీర్ కాలం చిత్రం హిందీలో ఖామోషిగా విడుదలై నిరాశపరిచింది. ఇక తమిళంలో కూడా ఇదే రిజల్ట్ వస్తుందేమోనని నయన్ బాధపడుతోందట. ఇలా వరుస పరాజయాలతో తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని నయన్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

RRR నటి రూ.350 కోట్ల విలువైన బంగ్లా ఇదే.. గృహప్రవేశం ఫోటోలు ఇవిగో
First Finalist: బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్‌.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి