మెహ్రీన్ డిమాండ్ పెరిగిందే..!

Published : Jun 20, 2019, 03:04 PM IST
మెహ్రీన్ డిమాండ్ పెరిగిందే..!

సారాంశం

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహ్రీన్ ఆ తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది.

'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహ్రీన్ ఆ తరువాత కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. అయితే స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

'ఎఫ్ 2' వంటి హిట్ సినిమా అందుకున్నా.. ఆమె కెరీర్ స్లోగానే సాగింది. ఎట్టకేలకు ఈ భామ బిజీ హీరోయిన్ గా మారింది. 'ఎఫ్ 2' సినిమా తరువాత కూడా అమ్మడు చేతిలో సినిమాల్లేవు. ఫైనల్ గా మన దర్శకనిర్మాతల దృష్టి మెహ్రీన్ పై పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ డిమాండ్ బాగా పెరిగింది. 

విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమాతో పాటు నాగశౌర్య సినిమా కూడా సైన్ చేసింది. అలానే కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ అనుకుంటున్నారు. దాదాపు ఆమె ఫైనల్ అయినట్లేనని చెబుతున్నారు. అలానే ఓ పంజాబీ సినిమాలో నటించనుంది.

అంతేకాదు.. ఓ తమిళ సినిమాకు కూడా సైన్ చేసింది. ధనుష్ హీరోగా దర్శకుడు దురై సెంథిల్ రూపొందించనున్న సినిమాలో మెయిన్ లీడ్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు. వరుస అవకాశాలు వస్తుండడంతో మెహ్రీన్ తన ఫోకస్ మొత్తం లుక్స్ మీదే పెట్టిందట. మరింత సన్నబడి నాజుకుగా తయారవ్వాలని చూస్తోంది. మొత్తానికి ఈ పంజాబీ బ్యూటీ సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్