నయనతార ‘కనెక్ట్​’ఓటిటి డేట్, ప్లాట్ ఫామ్

Published : Dec 25, 2022, 02:23 PM IST
 నయనతార ‘కనెక్ట్​’ఓటిటి డేట్, ప్లాట్  ఫామ్

సారాంశం

 నయనతారకి 'మాయ' (మయూరి) సినిమాతో హిట్ ఇచ్చిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాకి దర్శకుడు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. 


నయనతార కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  తనతో ఇంతకు ముందు ‘మయూరి’ సినిమా చేసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా చేసింది నయనతార. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ లాంటి విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అశ్విన్.. ‘కనెక్ట్’ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అందరూ నమ్మారు. అయితే అంత సీన్ లేదని ప్రేక్షకులు తేల్చేసారు. జనాలు ఈ సినిమా తో కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడీ సినిమా ఓటిటి లాక్ అయ్యింది. 

ఈ గురువారమే ధియేటర్లలో విడుదలై మిక్స్డ్​ రివ్యూస్​ సంపాదించిన ఈ హర్రర్​ మూవీ ఓటిటి రైట్స్​ ను నెట్​ ఫ్లిక్స్​ కొనుగోలు చేసినట్లు టాక్​. ఇందుకోసం భారీ మొత్తాన్నే నెట్​ ఫ్లిక్స్​ చెల్లించింది. అతి త్వరలోనే థియేటర్ రన్ పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం నెల లోనే ఓటిటి లో రానుందని సమాచారం.ఈ సినిమా కోసం నయన్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వరని…. ఓ మూలన నిల్చోబెడతారని అన్నారు. ఇక చాలా కాలం తర్వాత నయన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో ఆనందపడుతున్నారు అభిమానులు.

నిజానికి హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన నయనతార సినిమాలు దాదాపు మంచి వసూళ్లను రాబట్టాయి. అందువలన తన సొంత బ్యానర్లో సినిమా చేయడానికి ఆమె ఈ జోనర్ నే ఎంచుకుంది. నయనతార ఈ తరహా జోనర్లో మంచి కథలను ఎంచుకుంటుందనే నమ్మకం ఆడియన్స్ కి ఉంది. వాళ్లందరిలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తూ ఆమె 'కనెక్ట్' సినిమా చేసింది. పోస్టర్స్ తోను .. టీజర్ తోను ఈ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేయగలిగారు. కానీ వర్కవుట్ కాలేదు.
  

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు