
మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. `ఎస్‌ఎస్‌ఎంబీ29`గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న జక్కన్న ఆ కార్యక్రమాలు పూర్తయ్యాక కొంత రిలాక్స్ అయి మహేష్ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాదిలో ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది గతేడాది చివర్లోనే ప్రారంభమవుతుందనే వార్తలొచ్చాయి. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ సైతం ఇదే హింట్ ఇచ్చారు.
కానీ అనుకున్నట్టు జరగలేదు. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` ఆస్కార్ కి వెళ్లడంతో చాలా రోజులుగా ఆ పనిలోనే బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ సారి ఇండియన్ సినిమా ఆస్కార్ గెలిచేలా గట్టిగా శ్రమిస్తున్నారు. ప్రమోషన్స్ కోట్లు ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్‌లో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వారికి దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో మహేష్ తో చేయబోయే సినిమా రేంజ్ మారబోతుంది. దీన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తీయాలని నిర్ణయించుకున్నారు రాజమౌళి. అంతర్జాతీయంగా ఆయనకు పెరుగుతున్న పరిచయాల నేపథ్యంలో ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్లని కూడా తీసుకోబోతున్నారని సమాచారం. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారట.
ఇక ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌గా సాగుతుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వెంచరర్‌గా మహేష్ పాత్ర ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందన్నారు. ప్రస్తుతం రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ చిత్రస్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఒకటి తెలిసింది. కాకపోతే ఇది మహేష్-రాజమౌళి అభిమానులకు షాకిచ్చే విషయమే. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ని డిజ్పాయింట్ చేసే వార్తే అని చెప్పొచ్చు. ఇంతకి అసలు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ కేవలం 20 శాతం మాత్రమే కంప్లీట్ అయ్యిందట. రైటింగ్ స్టేజ్‌లోనే ఇంకా సగానికి కూడా రాలేదని, ఐడియాని స్క్రిప్ట్ గా మార్చే పనిలో విజయేంద్రప్రసాద్ ఉన్నారట.
అంతేకాదు ఈ సినిమా అడ్వెంచరస్‌గా ఉంటుందని, కానీ ఆఫ్రికన్ అడవుల బ్యాక్ గ్రౌండ్ అనేది కూడా వాస్తవం కాదని, ఆ బ్యాక్ డ్రాప్ వేరే అని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్ట్ రాజమౌళి వరకు వెళ్లాల్సి ఉంది, ఆయన వద్ద కథలో పోస్ట్ మార్టం జరుగుతుందని, ఆ తర్వాత మళ్లీ స్క్రిప్ట్ పై వర్క్ చేయాల్సి ఉంటుందని, ఇంకా రెండు మూడు దశల్లో కథని చెక్కాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ లెక్కన ఈ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి ఇంకా ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదట. అంతేకాదు మహేష్-రాజమౌళి సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో, లేదంటే ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తి కావడానికి టైమ్ పడుతుంది. ఈ సినిమా ఈ ఏడాది చివరల్లో గానీ, వచ్చే ఏడాది గానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీలా సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.