నయనతార కథతో హిట్టు కొట్టిన తాప్సీ!

Published : Jun 15, 2019, 01:57 PM IST
నయనతార కథతో హిట్టు కొట్టిన తాప్సీ!

సారాంశం

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న నటి నయనతార. ఓ పక్క కుర్ర హీరోలతో మరోపక్క సీనియర్ హీరోలతో జత కడుతూ నేటి తరం హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. 

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న నటి నయనతార. ఓ పక్క కుర్ర హీరోలతో మరోపక్క సీనియర్ హీరోలతో జత కడుతూ నేటి తరం హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఈ బ్యూటీ ఇప్పటివరకు విమెన్ సెంట్రిక్ సినిమాలు చాలానే చేసింది.

నిర్మాతలు కూడా ఆమెతో సినిమాలు తీయడం సేఫ్ గా భావిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథంటే ముందుగా నయన్ నే అడుగుతున్నారు. తాజాగా విడుదలైన 'గేమ్ ఓవర్' సినిమా కూడా నయనతార చేయాల్సిన కథేనట. నయన్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయాలని అనుకున్నారు.

నయనతార రెమ్యునరేషన్ మినహా ఏడు కోట్లలో సినిమా పూర్తి చేయాలని భావించారు. ఒకట్రెండు రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ కథ విషయంలో ఓ గొడవ వచ్చింది. ఈ లైన్ ఓ హాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నారు. ఆ కథకి సంబంధించిన రచయితకి, చిత్రబృందానికి విబేధాలు తలెత్తడంతో సినిమా ఆగిపోయింది.

ఆ కథే తాప్సీ దగ్గరకి వెళ్లింది. అయితే కథలో కొన్ని కీలక మార్పులు చేసి రూపొందించారు. మొత్తానికి నయనతార నుండి చేజారిన సినిమాను క్యాచ్ చేసి తాప్సీ తన లిస్ట్ లో మరో హిట్టు సినిమా వేసుకుంది. మరి నయన్ ఈ గేమ్ లో ఉండి ఉంటే ఎలా ఉండేదో .! 

PREV
click me!

Recommended Stories

నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?
డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్