అతడినే పెళ్లి చేసుకుంటా.. పెళ్లి డేట్ త్వరలో చెప్తా : నయనతార

Published : Mar 25, 2018, 11:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
అతడినే పెళ్లి చేసుకుంటా.. పెళ్లి డేట్ త్వరలో చెప్తా : నయనతార

సారాంశం

దక్షిణాదిలో ప్రస్తుతం లేడి సూపర్‌స్టార్ ఎవరంటే ఠక్కున నయనతార అనే ఒకే ఒక పేరు గుర్తోస్తుంది ఇటీవల ఆమె నటించిన కర్తవ్యం, ఇతర చిత్రాలు లేడీ సూపర్‌స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ తెచ్చిపెట్టాయి​

దక్షిణాదిలో ప్రస్తుతం లేడి సూపర్‌స్టార్ ఎవరంటే ఠక్కున నయనతార అనే ఒకే ఒక పేరు గుర్తోస్తుంది. ఇటీవల ఆమె నటించిన కర్తవ్యం, ఇతర చిత్రాలు లేడీ సూపర్‌స్టార్ హీరోయిన్‌ ట్యాగ్ తెచ్చిపెట్టాయి. కెరీర్ విషయంలో రాకెట్‌లా దూసుకెళ్తున్న నయనతార వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఆరంభం నుంచి మీడియాను ఆకర్షిస్తునే ఉన్నాయి. గతంలో శింబు, ప్రభుదేవా, ఆర్య లాంటి హీరోలతో అఫైర్లు పెళ్లి దాకా వచ్చి ఆగిపోయాయి. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్‌తో అఫైర్, డేటింగ్ వార్తలు మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నాయి. ఇప్పటి వరకు విగ్నేష్‌తో రిలేషన్‌పై పెదవి విప్పని నయన్ తాజాగా ఆయన గురించి ఓపెన్ అయ్యారు.

ఇక విగ్నేష్ శివన్‌తో అతిసన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ తన మనసులో మాట ఎప్పుడూ బయటపెట్టలేదు. ఒక బహిరంగ వేదికపై ఆయన నాకు కాబోయే భర్త (ఫియాన్సీ) అని నయన ప్రకటించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్‌కు మీడియాకే కాదు.. అభిమానులకు కూడా ఫర్‌ఫెక్ట్ సమాధానం అందించినట్టు నయనతార స్పష్టం చేసింది.

ఆరమ్ (కర్తవ్యం) సినిమా తర్వాత నయన్, గ్యాంగ్ చిత్రం తర్వాత విగ్నేష్ శివన్ కలిసి విహార యాత్ర కోసం అమెరికా వెళ్లారు. అక్కడ సేదతీరిన తర్వాత ఇటీవలనే చెన్నైకి వచ్చారు. ఆ తర్వాత వారి పనుల్లో బిజీగా మారారు. ఈ ఏడాదే నయన్, విగ్నేష్ పెళ్లి భాజాలు మోగడం ఖాయమనే మాట సినీవర్గాలకు, మీడియాకు ఉత్తేజకరమైన వార్తగా మారింది.

 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్