ప్రియుడు విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌.. లేట్‌గా రివీల్‌ చేసి షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

Published : Aug 11, 2021, 07:52 AM IST
ప్రియుడు విఘ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్‌.. లేట్‌గా రివీల్‌ చేసి షాకిచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ నయనతార

సారాంశం

నయన్‌ చేతి వేలికి రింగ్‌ కూడా కనిపించడంతో ఎంగేజ్‌మెంట్‌ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అటు నయన్‌గానీ, విఘ్నేష్‌ గానీ స్పందించలేదు. తాజాగా రివీల్‌ చేశారు.

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని వెల్లడించింది. ఆ మధ్య తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌, నయనతార ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. నయన్‌ చేతి వేలికి రింగ్‌ కూడా కనిపించడంతో ఎంగేజ్‌మెంట్‌ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అటు నయన్‌గానీ, విఘ్నేష్‌ గానీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలు సస్పెన్స్ గానే మిగిలిపోయాయి. 

ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ లేడీ సూపర్‌ స్టార్‌ రివీల్‌ చేసింది. తనకు విఘ్నేష్‌తో నిశ్చితార్థమైందని వెల్లడించింది. తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో ఆమె పాల్గొన్నారు. ఇందులో తన ఎంగేజ్‌మెంట్‌ గురించి చెప్పింది నయనతారం. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ.. `ఇది నా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌` అని స్పష్టం చేసింది. చాలా రోజులుగా నయనతార వేలికి ఆ రింగ్‌ ఉండటంతో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగి చాలా రోజులే అవుతుందని తెలుస్తుంది. 

అదే సమయంలో విఘ్నేష్‌తో ప్రేమ విషయంపై ఏ నాడూ నోరు విప్పలేదు నయనతార. తాజాగా ఈ టాక్‌ షోలో ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ న్యూస్‌గా మారింది. అంతేకాదు త్వరలోనే వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారని టాక్‌. 

ప్రస్తుతం నయనతారం.. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. విజయ్‌ సేతుపతి, సమంత ఇతర ముఖ్య పాత్రధారులు. దీంతోపాటు బాలీవుడ్‌లో షారూఖ్‌ ఖాన్‌తో అట్లీ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం. వీటితోపాటు తమిళంలో `నెట్రికన్`, రజనీకాంత్‌ `అన్నాత్తే`, అలాగే మరో సినిమా చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మహేష్ బాబు కి టెన్షన్ వస్తే ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా? సీక్రెట్ రివిల్ చేసిన సూపర్ స్టార్
సినిమాలను వదిలేస్తున్నా .. దళపతి విజయ్ సంచలన ప్రకటన