జూ.ఎన్టీఆర్ పై అభిమానంతోనే ఈ పని చేస్తున్నా.. మెగా హీరో కామెంట్స్

By telugu teamFirst Published Aug 10, 2021, 6:29 PM IST
Highlights

ఆగష్టు 9న పవన్ తేజ్ కొణిదెల బర్త్ డే సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేశారు. పవన్ తేజ్ స్టైలిష్ డాన్సింగ్ ఫోజులో కనిపిస్తున్నాడు. అసలు మ్యాటర్ అంతా బ్యాగ్రౌండ్ లోనే ఉంది. 

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మెగా ఫ్యామిలీ క్రికెట్ టీమ్ లా మారింది అంటూ ఫన్నీ కామెంట్స్ వింటూనే ఉన్నాం. అకీరా నందన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా మెగా ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన మరో హీరో పవన్ తేజ్ కొణిదెల. 

పవన్ తేజ్ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి కజిన్ బ్రదర్ కుమారుడు. ఈ ఏడాది మార్చి లో పవన్ తేజ్ 'ఈ కథలో పాత్రలు కల్పితం' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎం అభిరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం పవన్ తేజ్ మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. 

ఆగష్టు 9న పవన్ తేజ్ కొణిదెల బర్త్ డే సందర్భంగా ఈ లుక్ రిలీజ్ చేశారు. పవన్ తేజ్ స్టైలిష్ డాన్సింగ్ ఫోజులో కనిపిస్తున్నాడు. అసలు మ్యాటర్ అంతా బ్యాగ్రౌండ్ లోనే ఉంది. ఈ చిత్రంలో పవన్ తేజ్ జూ.ఎన్టీఆర్ వీరాభిమానిగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో బ్యాగ్రౌండ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ టెంపర్ చిత్రంలోనిది ఆ కటౌట్ స్టిల్. 

మెగా హీరో ఎన్టీఆర్ అభిమానిగా నటించడం అంటే కాస్త విచిత్రంగానే ఉంటుంది.కానీ తన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని పవన్ తేజ్ అంటున్నాడు. 'సపోర్ట్ అందిస్తున్న తెలుగు సినిమా అభిమానులందరికీ థ్యాంక్స్. జూ. ఎన్టీఆర్ పై ఉన్న నిజమైన అభిమానమే నన్ను ఈ పాత్ర చేసేలా చేసింది. నా రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

మెగా అభిమానులని, ఎన్టీఆర్ అభిమానులని మెప్పించడం నాకు బిగ్ ఛాలెంజ్. మీ అందరి ఆశీస్సులు కావాలి' అని పవన్ తేజ్ ట్వీట్ చేశాడు. శ్రీనివాస్ సీరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మించే ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పేరు కూడా ఎన్టీఆర్ టాకీస్. 

 

Firstly, I would like to thank each and every telugu cinema fans for the huge support!True admiration towards garu have made me play this interesting role and this is a CHALLENGING part to impress both "MEGA" and anna fans as well! Need all your blessings🙏 pic.twitter.com/txYhGOYk8F

— Pavan Tej konidela (@thisispavantej)
click me!