మొన్న పవన్ కళ్యాణ్.. నేడు రాంచరణ్.. హీరోయిన్ పంట పండిందిగా!

pratap reddy   | Asianet News
Published : Aug 10, 2021, 07:31 PM IST
మొన్న పవన్ కళ్యాణ్.. నేడు రాంచరణ్.. హీరోయిన్ పంట పండిందిగా!

సారాంశం

తెలుగు అమ్మాయి అంజలి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జర్నీ చిత్రంతోనే అంజలి టాలెంట్ మొత్తం బయట పడింది. ఆ తర్వాత గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాల్లో తన సత్తా నిరూపించుకుంది.

తెలుగు అమ్మాయి అంజలి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జర్నీ చిత్రంతోనే అంజలి టాలెంట్ మొత్తం బయట పడింది. ఆ తర్వాత గీతాంజలి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాల్లో తన సత్తా నిరూపించుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురుకావడంతో కాస్త వెనుకబడింది. 

ఏది ఏమైనా ఇటీవల అంజలి విభిన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆమె కెరీర్ మళ్ళీ గాడిలో పడుతోంది. ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. జరీనా పాత్రలో అంజలి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 

వకీల్ సాబ్ చిత్రంలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ అంజలి నటనతో హైలైట్ అయ్యాయి. తాజాగా అంజలికి పాన్ ఇండియా మూవీలో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో పాన్ ఇండియా చిత్రానికి అంతా సిద్ధం అయింది. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఈ మూవీలో ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైంది. మరో కీలక పాత్ర కోసం డైరెక్టర్ శంకర్ అంజలిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంజలి పాత్ర కూడా దాదాపుగా హీరోయిన్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే కథని మలుపుతిప్పేలా అంజలి రోల్ ని శంకర్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వకీల్ సాబ్ సక్సెస్ తో జోరుమీద ఉన్న అంజలికి రాంచరణ్ సినిమాలో ఛాన్స్ బోనస్ అనే చెప్పాలి. ఈ మూవీతో అంజలి మరింతగా దూసుకుపోతే అవకాశం లభించింది. మరోవైపు అంజలి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మలయాళీ థ్రిల్లర్ నాయట్టు రీమేక్ లో లీడ్ రోల్ ప్లే చేయనుంది. 

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు కి టెన్షన్ వస్తే ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా? సీక్రెట్ రివిల్ చేసిన సూపర్ స్టార్
సినిమాలను వదిలేస్తున్నా .. దళపతి విజయ్ సంచలన ప్రకటన