డయానా.. నయన్ గా ఎలా మారిందంటే..?

Published : Jul 02, 2019, 10:58 AM IST
డయానా.. నయన్ గా ఎలా మారిందంటే..?

సారాంశం

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయనతార అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయకి.

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయనతార అత్యధిక పారితోషికం అందుకుంటున్న నాయకి. ఓ పక్క గ్లామర్ హీరోయిన్ గా కనిపిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సైన్ చేసేస్తుంది.

నయనతార మలయాళీ అమ్మాయి.. ఆమె అసలు పేరు డయానా.. మరి నయనతారగా ఎలా మారిందంటే.. దానికొక స్టోరీ కూడా చెబుతున్నారు. నయనతార అయ్యా అనే సినిమాతో కోలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తరువాత గజినీ, చంద్రముఖి ఇలా వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన కలిసి నటించింది.

కమల్ హాసన్ తో తప్ప సౌత్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ బ్యూటీ. నయన్ తమిళ ఇండస్ట్రీకి రాకముందు మాత్రుభాషలో 'మనసీనక్కరే' అనే సినిమాలో నటించింది. అందులో నటుడు జయరాం హీరో. సీనియర్ నటి షీలా ముఖ్య పాత్ర పోషించారు. సత్యన్ దర్శకుడు.

ఆయన డయానా పేరుని మార్చాలని భావించారట. ఏం పేరు పెట్టాలా..? అని చాలా ఆలోచించారట. డయానా పేరుని మార్చి వెల్లడించడానికి ఓ వేదికనే ఏర్పాటు చేశారట. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటి షీలా డయానాకు నయనతార అనే పేరుని పెట్టారట. తార అంటే నక్షత్రం కాబట్టి సినిమాలో నయనతార ఓ వెలుగు వెలగాలని ఆమెని ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?