'నాయకుడు' కు అలా OTT పోటు పొడిచారు

Published : Jul 18, 2023, 06:00 PM IST
'నాయకుడు' కు అలా OTT పోటు పొడిచారు

సారాంశం

ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకొని జులై 14వ తేదీన రిలీజ్ చేశారు. 


సినిమా రిలీజ్ లు డేట్ ఫిక్స్ చేసేముందు...శెలవులు ఏమైనా ఉన్నాయా..పరీక్షల సమయమా.., ప్రక్కన ఏ సినిమా రిలీజ్ అవుతోంది, తుఫానులు గట్రా ఉన్నాయా..ఇన్ని లెక్కలు వేస్తూంటారు. చాలావరకూ అవి సత్ఫలితాలు ఇస్తూంటాయి. అలా చేయకుండా చేతిలో బొమ్మ ఉంది కదా ముందుకు పంపితే రివర్స్ అవుతుంది. ఇప్పుడు నాయకుడు అలాంటి పరిస్దితి ఎదురైంది. 

సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా వచ్చిన సినిమా మామన్నన్. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో తమిళంలో వచ్చిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ టాన్ ను తెచ్చుకుంది. మొదటిరోజే ఈసినిమా 5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రజాదారణ పొందిందే. ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
 
ఈసినిమాను ఇటీవలే తెలుగులో   నాయకుడు అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు సొంతం చేసుకొని జులై 14వ తేదీన రిలీజ్ చేశారు. 

అయితే ఇక్కడ సినిమా రిలీజైందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రొపర్ ప్లానింగ్ లేదు. వడివేలు, ఉదయనిథి స్టాలిన్ క్రౌండ్ ఫుల్లర్స్ కాదు అని తెలిసినప్పుడు మరింత పబ్లిసిటీ చేసి ఉండాల్సింది. అది జరగలేదు. మరో ప్రక్క శివకార్తికేయన్ మహావీరుడు, బేబి సినిమాలు రిలీజ్ అయ్యాయి. బేబి జనాల్లోకి వెళ్లిపోయింది. దాంతో తమిళంలో దాదాపు 70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాని ఇక్కడ పట్టించుకున్న వాళ్లు లేరు.

అది చాలదన్నట్లు  ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను జులై 27వ తేదీన ఈసినిమా స్ట్రీమింగ్ కు రానుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ,మలయాళం భాషల్లో ఈసినిమా అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అని తెలిసాక థియేటర్ కు వెళ్లి పనిగట్టుకుని ఎవరు చూస్తారు చెప్పండి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌