మణిరత్నం హిట్ కొట్టేలా ఉన్నాడే!

Published : Aug 25, 2018, 12:03 PM ISTUpdated : Sep 09, 2018, 12:15 PM IST
మణిరత్నం హిట్ కొట్టేలా ఉన్నాడే!

సారాంశం

దర్శకుడిగా 'దళపతి','నాయకుడు' వంటి యాక్షన్ సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం ఆ తరువాత రొమాంటిక్ లవ్ స్టోరీస్  కి పరిమితమయ్యారు

దర్శకుడిగా 'దళపతి','నాయకుడు' వంటి యాక్షన్ సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం ఆ తరువాత రొమాంటిక్ లవ్ స్టోరీస్  కి పరిమితమయ్యారు. ఈ క్రమంలో 'ఓకే బంగారం' తప్ప ఏ సినిమా కూడా ఆయనకి హిట్ తీసుకురాలేకపోయింది. మణిరత్నం మార్క్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన డైరెక్ట్ చేస్తోన్న 'నవాబ్' సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు.

కానీ తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తే మణిరత్నం ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఉంది. రెండు నిమిషాల 46 సెకన్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ను బట్టి ఇదొక యాక్షన్ డ్రామా కథ అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామీ, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితి రావు ఇలా భారీ తారాగణంతో పెద్ద స్కేల్ లో ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్ ను బట్టి అన్ని పాత్రలకు సమాన ప్రాముఖ్యతనిచ్చినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ చివరిలో అరవింద్ స్వామీ.. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా..? ఉంటే అసలు నమ్మకు అని చెప్పే డైలాగ్ బాగుంది. సినిమాలో అరవింద్ స్వామీ, విజయ్ సేతుపతి స్నేహితులుగా కనిపించనున్నారు. విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?