Ghani Movie Update : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్‌.. ఎప్పుడు ఎక్కడా అంటే

Published : Mar 29, 2022, 01:18 PM ISTUpdated : Mar 29, 2022, 02:51 PM IST
 Ghani Movie Update : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్‌.. ఎప్పుడు ఎక్కడా అంటే

సారాంశం

హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన తాజా  చిత్రం ‘గని’. ఈ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ ప్లాన్డ్ గా చేస్తుున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.   

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గని’ (Ghani) మూవీతో మెగా ప్రిన్స్, హీరో వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రొఫెషనల్ బాక్సర్ గా  కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ శక్తివంచన లేకుండా క్రుషి చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక ట్రైనర్ ను నియమించుకుని నెలల తరబడి బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకున్నాడు వరుణ్. అలాగే సిక్స్ ప్యాక్ బాడీతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మరోవైపు మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) కూడా గని స్పెషల్ సాంగ్ లో అందాలను ఆరబోయడం సినిమాకు గ్లామర్ పాయింట్ గా చెప్పొచ్చు. 

ఇక మూవీ ప్రమోషన్స్ విషయానికొస్తే మేకర్స్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రీలీజ్ ఈవెంట్, పలు రకాల ప్రమోషన్స్ ను చేస్తూ మూవీని ఆడియెన్స్ కు మరింత చేరేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ RRR మూవీ ప్రదర్శనలో ప్రమోషన్స్ లో భాగంగా వెయ్యి థియేటర్లలో ‘గని’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక గని మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ నిర్వహించనున్నారు. ఇందుకు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రాబోతున్నారు. ఏప్రిల్‌ 2న ఉగాది సందర్భంగా వైజాగ్‌లో ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు.

`పుష్ప` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకుని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిచిన బన్నీ గెస్ట్ గా `గని` ఈవెంట్‌ జరుగుతున్న నేపథ్యంలో దీనికి మంచి బజ్‌ వస్తుందని చెప్పొచ్చు. ఇక స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ `గని` చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది.  ఏప్రిల్ 8న ఈ చిత్రం విడుదల కానుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా