కంటతడి పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఇంత కష్టమని రెండేండ్లుగా తెలియ లేదు.. నిజమే కదా?

Published : Jul 25, 2022, 02:40 PM IST
కంటతడి పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఇంత కష్టమని రెండేండ్లుగా  తెలియ లేదు.. నిజమే కదా?

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ( Lakshmi Manchu) తాజాగా భావోద్వేగానికి గురైంది. తన కూతురు గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. తాజాగా ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

స్టార్ కిడ్ మంచు లక్ష్మి తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో నటించింది. టాలీవుడ్ లో ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో లేడీ విలన్ గా బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించే మంచు లక్ష్మి తాజాగా కంటతడి పెడుతూ ఓ వీడియోను అప్ లోడ్ చేసింది. తన కూతురు గురించి చెబుతూ కన్నీరుమున్నీరైంది. రెండేండ్లుగా ఇంతటి బాధ వస్తుందనుకోలేదని తెలిపింది.  

ఇంతకీ విషయం ఏంటంటే.. సోమవారం ఉదయం తన కూతురు విద్యా నిర్వాణను మంచు లక్ష్మి  స్కూల్ కు పంపించింది. అయితే, ఇన్నాళ్ల పాటు తనతోనే ఉన్న కూతురు స్కూల్ కు వెళ్తుండటంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన కూతురు స్కూల్ కు వెళ్లే ఫొటోలు..  వీడియోలను ఇన్ స్టా బయోలో పోస్ట్ చేసింది.   కరోనా తర్వాత రేండెండ్ల పాటు ఇంట్లోనే ఉన్న కూతురు విద్యా నిర్వాణతో లక్ష్మి ఆడుతూ పాడుతూ సమయం గడిపింది. పలు ఫిట్ నెస్ వీడియోలు, రీల్స్ చేస్తూ నెటిజన్లను అలరించింది. ఉన్నట్టుండి విద్యా స్కూల్ కు వెళ్తుండటంతో భావోద్వేగానికి గురైంది. పిల్లలు దూరమైతే ఇంత కష్టంగా ఉంటుందా? అని తన బాధను షేర్ చేసుకుంది.

పలు టెలివిషన్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ‘మా వింత గాధ వినుమా, పిట్ట కథలు (Pitta kathalu)  చిత్రాల్లో నటించింది. కరోనా తర్వాత సినిమాలకు కాస్తా దూరంగా ఉంటోంది మంచు లక్ష్మి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. పలు ప్రత్యేక రోజుల్లో తన మార్క్ చూపెడుతూ జోష్ నింపుతోంది. ప్రస్తుతం అగ్ని నక్షత్రం ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మాతలుగా వ్యవహిరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే