
కథ రీత్యా ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)లో సాంగ్స్ కి పెద్ద ప్రాధాన్యత లేదు. మూడు గంటల నిడివి గల సినిమాలో సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్ని కొద్ది పాటల్లో రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వాటిలో నాటు నాటు ఒకటి కాగా... కొమురం భీముడో సాంగ్ ఒకటి. ఈ రెండు సాంగ్స్ స్క్రీన్ పై అద్భుతంగా పేలాయి. అయితే విడుదలకు ముందే నాటు నాటు సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఈ సాంగ్ స్టెప్స్ జనాలను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
ప్రోమోలో చూసిన చూసిన దానికి పది రెట్లు గొప్పగా నాటు నాటు సాంగ్ (Naatu Naatu Video Song)చిత్రీకరించారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్(NTR), చరణ్ ఈ సాంగ్ లో పోటీపడి డాన్స్ చేశారు. సింక్ మిస్ కాకుండా బ్రిటిష్ కోటలో చరణ్(Charan), ఎన్టీఆర్ నర్తించడం గొప్ప అనుభూతిని పంచింది. ఈ సాంగ్ సమయంలో ఆడియన్స్ సీట్స్ లో కూర్చోలేదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆకట్టుకున్న నాటు నాటు సాంగ్ ఫుల్ వీడియో నేడు విడుదల చేశారు. ఈ పాటకున్న క్రేజ్ రీత్యా... విడుదలైన నిమిషాల్లో వీడియో వైరల్ గా మారింది. సిల్వర్ స్క్రీన్ పై లిమిటెడ్ గా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్... యూట్యూబ్ లో అన్ లిమిటెడ్ గా నచ్చినన్ని సార్లు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
నాటు నాటు సాంగ్ కి సీనియర్ రైటర్ చంద్రబోస్ లిరిక్స్ అందించారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేశారు. మరోవైపు మూడో వారం కూడా బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ రన్ కొనసాగుతుంది. హిందీలో అటాక్, తెలుగులో గని ప్లాప్ టాక్ తెచ్చుకోవడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. రెండో రోజు మధ్యాహ్నం నుండే గని థియేటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన మొదలుపెట్టారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి.
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ రూ. 1000 కోట్ల వసూళ్లు దాటేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో కలెక్షన్స్ కింగ్ గా నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డ్స్ కూడా ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయడం విశేషం. బీస్ట్, కెజిఎఫ్ 2 విడుదలయ్యే వరకూ ఆర్ ఆర్ ఆర్ జోరు కొనసాగనుంది.