నటుడు నాజర్‌ ఇంట్లో విషాదం..

Published : Oct 10, 2023, 06:40 PM IST
నటుడు నాజర్‌ ఇంట్లో విషాదం..

సారాంశం

 ప్రముఖ విలక్షణ నటుడు నాజర్‌ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రి కన్నుమూశారు. తాజాగా విలక్షణ నటుడు నాజర్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. 95 వయసున్న నాజర్‌ తండ్రి మెహబూబ్‌ బాషా మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో గల తన నివాసంలో ఆయన ప్రాణాలు వదిలారు. ఆ విషయాన్ని నాజర్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

 తండ్రి మరణంతో నాజర్‌ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. ఈ సందర్భంగా నాజర్‌కి సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన తండ్రి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మెహబూబ్‌ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారని తెలుస్తుంది. 

నాజర్‌ గత నాలభై ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నారు. హీరోగా నుంచి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వందల చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలు కూడా చేశారు. 1985లో కె బాలచందర్‌ రూపొందించిన `కల్యాణ అగథిగల్‌` చిత్రంతో నటుడిగా మారారు. ఈ చిత్రంలో సహాయ నటుడిగా మెప్పించారు. బలమైన పాత్రలకు ఆయన కేరాఫ్‌గా నిలుస్తారు. ఇటీవల వచ్చిన `800`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రాలతోపాటు `పోకిరి`, `బాహుబలి`, `భగీరథ`, `చంటి`, `అదుర్స్` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ తెలుగులో బిజీగా ఉన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?