K viswanath: ఓ సూట్ కలిపిన బంధం.. కే విశ్వనాథ్ కి ఈయన చాలా ప్రత్యేకం

Published : Feb 03, 2023, 01:09 AM IST
K viswanath: ఓ సూట్ కలిపిన బంధం.. కే విశ్వనాథ్ కి ఈయన చాలా ప్రత్యేకం

సారాంశం

ప్రతి ఒక్కరి జీవితంలో  కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ఇక టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, కళా తపస్వి కే విశ్వనాథ్ ( K Vishwanath) జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు.ఒక సందర్భంలో కలిసిన వారి మధ్య వీడదీయలేని బంధం ఏర్పడింది.

ప్రతి ఒక్కరి జీవితంలో  కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ఇక టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, కళా తపస్వి కే విశ్వనాథ్ ( K Vishwanath) జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు.ఒక సందర్భంలో కలిసిన వారి మధ్య వీడదీయలేని బంధం ఏర్పడింది.

కొందరితో పరిచయాలు విడదీయరాని అనుబంధంగా మారుతాయి.  టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, కళా తపస్వి కే విశ్వనాథ్ జీవితంలోనూ ఓ ప్రత్యేకమైన వ్యక్తితో 25 ఏళ్ళ క్రితం కలిగిన పరిచయం బంధంగా మారింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. ఓ సాధరణ టైలర్ మాత్రమే.. ఆయన పేరు నారాయణ రావు. శుభసంకల్పం సినిమా వీరిద్దరినీ కలిసేలా చేసింది. ఇప్పుడు ఆత్మీయ బంధంగా మారింది.

1994లో 'శుభసంకల్పం' సినిమా షూటింగ్ కోసం కె.విశ్వనాథ్ విశాఖపట్నం వచ్చారంట. షూటింగ్ లో భాగంగా ఆయనకు అర్జెంటుగా సూటు కావాల్సి వచ్చింది. మెటీరియల్ తీసుకుని టైలర్ నారాయణ వద్దకే వెళ్ళారు. అప్పటికే వైజాగ్ లో సూట్ స్పెషలిస్టుగా ఉన్న నారాయణ రావు విశ్వనాథ్ లాంటి పెద్దాయనకు సూచన మేరకు అద్భుతంగా సూటు కుట్టించరంట. 

అలా సూటూతో స్నేహబంధం ఎర్పడి 25 ఏండ్లుగా విడదీయలేని ఆత్మీయ బంధంగా మారిందట. అప్పటి నుంచి నారాయణ రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్తున్నారు.. ప్రతి ఏడాది  విశ్వనాథ్ పుట్టిన రోజున తన చేతులతో స్వయంగా కుట్టిన దుస్తులను అందిస్తారు. ఇప్పుడు ఎన్నెన్నో జన్మల బంధంగా బలపడింది. ఎంతలా అంటే కె.విశ్వనాథ్ ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా..  నారాయణ రావును మొదట కలుస్తారంట.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?