టీజర్ ,ట్రైలర్,ఇంకా అవకాసం ఉంటే పోస్టర్ చూసి కథేంటో పసిగట్టేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంత పెద్ద హిట్టైందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్. తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన వారు ఈ చిత్రం కథ ఫలానా అంటూ మాట్లాడుకుంటున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర కథ ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. ఇందులో అన్న జగపతిబాబు ఎమ్ ఆర్వోగా చేస్తూంటాడు. అతని సవితి తమ్ముడు నాని. తన అన్న అతన్ని దూరం పెడతాడు. ఇద్దరికీ మొదటి నుంచి మాటలు ఉండవు. ఎవరి జీవితం వారిది అన్నట్లు సాగుతూంటుంది. అయితే అన్నని ఓ ల్యాండ్ ఆక్రమణ విషయంలో కొంతమంది తో తగువు పడతాడు. వాళ్లు అన్నమీద ఎటాక్ చేస్తాడు. అన్నకు ఇలా దెబ్బ తిన్నాడని తెలిసాక తమ్ముడు...ఏం చేసాడు..తనని పట్టించుకోకపోయినా ఎలా విలన్స్ పై రివోల్ట్ అయ్యాడు అనేది మిగతా కథ అని తెలుస్తోంది.
రాజశేఖర్, శోభన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బలరామకృష్ణులు ప్రేరణతో దర్శకుడు టక్ జగదీష్ తెరకెక్కించారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు, ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులకు అనుగుణంగా దర్శకుడు స్క్రిప్ట్‌లో తగినంత మార్పులు చేసి సినిమాని రూపొందించనున్నాడని అంటున్నారు. అయితే ఇది కేవలం సినీ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారమేనా, నిజమా అనేది తెలియాలంటే రిలీజ్ దాకా వెయిట్ చెయ్యాల్సిందే.
ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్ ఏం చేశాడో చూపించారు. షైన్స్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానుంది.