బన్నీకి షాక్‌ ఇచ్చిన ధనుష్‌-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!

Published : Nov 17, 2020, 09:40 AM IST
బన్నీకి షాక్‌ ఇచ్చిన ధనుష్‌-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!

సారాంశం

తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది.   

నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి షాక్‌ ఇచ్చింది. ఎవరూ ఊహించిన మార్క్ ని దాటేసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. తమిళంలో ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసింది. 

సౌత్‌ ఇండియాలోనే ఈ పాట ఇప్పుడు నెంబర్‌ వన్‌గా నిలిచింది. సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట ఈ మార్క్ ని చేరుకోలేదు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` సినిమాలోని పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇందులో `బుట్టబొమ్మ` సాంగ్‌ దాదాపు నలభై కోట్ల వ్యూస్‌ని దాటేసింది. ఈ ఆల్బమ్‌లోని పాటలు సైతం కోట్లల్లో వ్యూస్‌ని రాబట్టాయి. ఈ నేపథ్యంలో బన్నీకి షాక్‌ ఇచ్చేలా ధనుష్‌, సాయిపల్లవి జంటగా వచ్చిన `రౌడీ బేబీ` సాంగ్‌ కొత్త రికార్డు సృష్టించడం విశేషం. 

దీనిపై ధనుష్‌ స్పందించారు. `సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట సాధించని రికార్డుని `రౌడీ బేబీ` సాధించిందని ధనుష్‌ తెలిపారు. ఒకప్పుడు ప్రపంచాన్ని షేక్‌ చేసిన పాట `కొలవెరి ఢీ` 9వ యానివర్సరీ రోజే ఈ పాట బిలియన్‌ వ్యూస్‌ సాధించడం సంతోషంగా ఉందని ధనుష్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ఇక `మారి2` చిత్రానికి బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. ఇప్పుడు యువన్‌పై యావత్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ