నాని ‘దసరా’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడు? ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

Published : Jan 26, 2023, 03:47 PM IST
నాని ‘దసరా’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడు? ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

సారాంశం

ఊరమాస్ లుక్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్న చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధం  అవుతున్న ఈ చిత్రం నుంచి త్వరలో టీజర్ రాబోతోంది. ఇందుకు డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ ప్రకటించారు.  

‘శ్యామ్ సింగరాయ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని (Nani)అదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘దసరా’తో  ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ అందించేందుకు సిద్ధం అవుతున్నారు. నాని కేరీర్ లోనే  తొలిసారిగా ఊరమాస్ లుక్ లో నటిస్తుండటం  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) నాని సరసన మరోసారి నటిస్తోంది. గతంలో ‘నేను లోకల్’లో నానికి జోడీగా నటించిన విషయం తెలిసిందే. 

మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకా చకా కొనసాగుతున్నాయి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అప్డెట్ అందించారు. ‘దసరా’ టీజర్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జనవరి 30న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా పంచుకున్న ప్రమోషనల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నాని చేతిలో కర్ర పట్టుకొని రాజ్ ధుత్ బండిపై ఎవరికోసమో కాపుకాచుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. సూర్యస్తమయంలోని ఈ స్టిల్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. 

ఈ ఏడాది మార్చి 30న ‘దసరా’ను విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. నాని తొలిపాన్ ఇండియా సినిమా కావడంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక నాని లుక్,  ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరోవైపు నాని తన 30వ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ శౌర్య దర్శకత్వం వహించనున్నారు. హేషమ్ అబ్దుల్ సంగీతం అందించనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే