Nani30 : ‘నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం ప్రారంభానికి సిద్ధం? ఎప్పుడంటే?

By team telugu  |  First Published Jan 28, 2023, 5:57 PM IST

నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా గ్రాండ్ లాంచ్ కు యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా క్రేజీ బజ్ వినిపిస్తోంది.
 


బ్యాక్ టు బ్యాక్  సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని (Nani) విభిన్న కథలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం నాని నటించిన ‘దసరా’ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈలోగా న్యూ ఇయర్ స్పెషల్ గా మరో కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఇప్పటికే వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

Nani30 చిత్రాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. జనవరి 31న గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. హైదరాబాద్ లో టాలీవుడ్  ప్రముఖులతో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘దసరా’ రిలీజ్ కు ముందే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని అర్తం అర్థం అవుతోంది. ఇప్పటికే నాని గడ్డం తీసేని న్యూ లుక్ లోకి మారిపోయాడు. ‘నాని30’పైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం. 

Latest Videos

నాని కొత్త చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శౌర్య దర్శకత్వం వహించబోతున్నారు. నాని జతగా.. సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి  పరిచయం చేయబోతున్నాడు నాని. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్  గ్లింప్స్‌ తో తండ్రీకూతుళ్ల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు క్లియర్ అవుతోంది. 

మరోవైపు దసరా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ  లో నానికి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఫస్ట్ టైమ్ నాని ఊరమాస్ లుక్ లో అలరించ బోతున్నారు. మార్చి 30న చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు. 

click me!