Pathaan: బాలీవుడ్‌కి ఊపిరిపోసిన `పఠాన్‌`.. మూడు రోజుల్లో కలెక్షన్ల ఊచకోత.. రికార్డులన్నీ పటాపంచల్‌..

Published : Jan 28, 2023, 05:22 PM IST
Pathaan: బాలీవుడ్‌కి ఊపిరిపోసిన `పఠాన్‌`.. మూడు రోజుల్లో కలెక్షన్ల ఊచకోత.. రికార్డులన్నీ పటాపంచల్‌..

సారాంశం

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `పఠాన్‌` సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. `పఠాన్‌` కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్‌ చేయడమే కాదు, బాలీవుడ్‌కి ఊపిరిపోసింది. గత మూడు, నాలుగేళ్లుగా బాలీవుడ్‌కి సరైన హిట్‌ లేదు. 

షారూఖ్‌ ఖాన్‌ నటించిన `పఠాన్‌` సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా కలెక్షన్లు దిమ్మతిరిగేలా వస్తుండటం విశేషం. సౌత్‌ కంటే నార్త్ లో ఈ సినిమా రికార్డులు షేక్‌ చేస్తుంది. మరే హిందీ సినిమాకి సాధ్యం కాని విధంగా వసూళ్లని రాబడుతుంది. ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్లు బాలీవుడ్ మేకర్స్ కి సైతం షాక్‌కి గురి చేస్తున్నాయి. ఇది మూడు రోజుల్లో ఏకంగా మూడువందల కోట్లకుపైగా గ్రాస్‌ని సాధించడం విశేషం. దీంతో ఇది బాలీవుడ్‌ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇప్పటికే బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్స్ గా ఉన్న `సుల్తాన్‌`, `దంగల్‌` వంటి మూవీస్‌కి కూడా ఈ రేంజ్‌ కలెక్షన్లు రాలేదు. ఓవరాల్‌గానే ఆ సినిమాలు ఐదు వందల కోట్ల గ్రాస్‌ వసూలు చేశాయి. కానీ `పఠాన్‌` ఏకంగా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 313కోట్లు రాబట్టింది. దీంతో పాటు బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన `కేజీఎఫ్‌2` రికార్డులను బ్రేక్‌ చేసింది. కేవలం బాలీవుడ్‌లో ఇది 161కోట్లు రాబటి `కేజీఎఫ్‌2`ని మించిపోయింది. ఇండియాలో 201కోట్లు, ఓవర్సీస్‌లో రూ.112కోట్లు సాధించింది. ఇలా వరల్డ్ వైడ్‌గా ఫాస్ట్ గా రూ.313క్రోర్స్ వసూలు చేసిన బాలీవుడ్‌ సినిమాగా రికార్డులు క్రియేట్‌ చేసింది. 

శనివారం, ఆదివారం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశం. ఈ రెండు రోజుల్లో ఈజీగా ఇంకో వంద నుంచి రూ.150కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా ఈ లాంగ్ వీకెండ్‌లోనే ఈ సినిమా ఐదువందల కోట్ల గ్రాస్‌ని రీచ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. లాంగ్‌ రన్‌లో ఈ సినిమాకి ఆరు, నుంచి ఏడువందల కోట్ల గ్రాస్‌ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కంటెంట్‌ పరంగా ఇది యావరేజ్‌గానే ఉన్నా, చాలా రోజుల తర్వాత షారూఖ్‌కి హిట్‌ రావడంతో బాలీవుడ్‌ జనాలు భుజానేసుకుని దీన్ని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తున్నారు.

ఇదిలా ఉంటే `పఠాన్‌` కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్‌ చేయడమే కాదు, బాలీవుడ్‌కి ఊపిరిపోసింది. గత మూడు, నాలుగేళ్లుగా బాలీవుడ్‌కి సరైన హిట్‌ లేదు. గతేడాది `దృశ్యం 2` ఉన్నంతలో బాగానే కలెక్ట్ చేసింది. ఇది రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. కానీ `పఠాన్‌` స్థాయిలో బాలీవుడ్‌ మేకర్స్ కి ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయింది. బాలీవుడ్‌లో `బాయ్‌కాయ్‌` ట్రెండ్‌ ఊపందుకోవడంతో కొన్ని బాగున్నా సరిగా ఆడలేదు. పైగా మారిన ట్రెండ్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ మేకర్స్ దాన్ని పట్టుకోలేకపోవడంతో వరుసగా స్టార్‌ హీరోల సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేకపోయాయి.

దీంతో బాలీవుడ్‌ మేకర్స్ అంతా డిప్రెషన్స్ కి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఎలాంటి సినిమాలు చేయాలనే డైలామాలోనూ పడిపోయారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన `పఠాన్‌` అందరి అంచనాలను పటాపంచ్‌ల్‌ చేసింది. నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఈ మధ్య కాలంలో ఇండియా వైడ్‌గా యాక్షన్‌ సినిమాల జోరు సాగుతుంది. `కేజీఎఫ్‌2`, `విక్రమ్‌`, `కాంతార`,`ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప` వంటి సినిమాలు యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కి బ్లాక్‌ బస్టర్స్ అయ్యాయి. అదే పంథాలో వచ్చిన `పఠాన్‌` సైతం సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. బాలీవుడ్ కి ప్రాణం పోసినంత పనిచేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?