
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్ నాని హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన భారీ నిర్మాత దానయ్య డి.వి.వి… శివ నిర్వాణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 షూటింగ్ నవంబర్ 23 ఉదయం 9.38 గంటలకు ఫిలింనగర్ దైవ సన్నిధానంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైంది.
నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టిలపై తీసిన ముహూర్తపు షాట్‌కి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, దామోదర ప్రసాద్, మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్, దర్శకుడు బి.వి.ఎస్.రవి, జెమిని కిరణ్, శివలెంక కృష్ణప్రసాద్, బెక్కం వేణుగోపాల్ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.