
2011 లో నందమూరి బాలకృష్ణతో ‘పరమవీర చక్ర’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్ వైపు వెళ్ళిపోయి మరో తెలుగు సినిమాలో నటించలేదు. మళ్ళీ దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఒక హాట్ హాట్ ఐటం సాంగ్ తో..
‘ఆకతాయి’ అనే సినిమాలో ఓ స్పెషల్ ఐటమ్ పాటలో కనిపించనుంది అమీషా పటేల్. ఈ పాట చిత్రీకరణ సారధి స్థూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో జరిగింది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ సందర్బంగా అమీషా పటేల్ మాట్లాడుతూ ‘చాలా ఏళ్ల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది’ అన్నారు. ఆశిష్‌రాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ భీమన డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. అని తెలిపారు.