Nani Movie OTT: డైరెక్ట్ గా ఓటీటీలో నాని మరో సినిమా రిలీజ్, ఏ సినిమా అంటే..?

Published : Apr 27, 2022, 06:27 PM IST
Nani Movie OTT: డైరెక్ట్ గా ఓటీటీలో నాని మరో సినిమా రిలీజ్, ఏ సినిమా అంటే..?

సారాంశం

కరోనా టైమ్ లో వరుసగా రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేశాడు నేచురల్ స్టార్ నానీ. అందులో ఒకటి ప్లాప్, మరొకటి హిట్. ఇక ఇప్పుడు థియేటర్లు రన్ అవుతున్న టైమ్ లో కూడా తన మరో సినిమాలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కించబోతున్నాడు యంగ్ హీరో. 

నేచురల్ స్టార్ నాని నటించిన వి, టక్‌ జగదీష్ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ య్యాయి. అయితే అందులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన వి సినిమా డి జాస్టర్ అవ్వగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన టక్ జగదీష్ మాత్రం హిట్ అనిపించుకుంది. థియేటర్లో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాలు మహమ్మారి వల్ల ఓటీటీలో విడదల చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై అప్పట్లో నాని, నాని ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేశారు. 

ఇక నానీకి సాలిడ్ హిట్ అంటే శ్యామ్ సింగరాయ్ అనే చెప్పాలి.  లాస్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయిన శ్యామ్‌ సింగరాయ్‌ మాత్రం థియేటర్లోకి వచ్చి నానీకి మెమోరబుల్ హిట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు నానీ మరోసారి ఓటీటీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నానీకి సంబంధించిన ఓచిత్రం ఒకటి నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అది  నాని  నటించిన సినిమా కాదు నానీ ప్రోడక్షన్‌లో ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన  సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎక్కబోతోంది. మీట్‌ క్యూట్‌ టైటిల్ తో రూపొందిన సినిమాను నాని స్వయంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాడట. 

ఆంథాలజీ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లక్స్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 5 డిఫరెంట్ స్టోరీస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాహుబలి కట్టప్ప సత్యరాజ్‌, శివ కందుకూరి, దీక్షిత్‌ శెట్టి, రూహాని శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ్మ లాంటి స్టార్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. 

 ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదల చేస్తేనే బాగుంటుందని భావించి నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మీట్‌ క్యూట్‌ నేరుగా నెట్‌ఫ్లక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. కానీ దీనిపై ఇంతవరకు  అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. అయితే నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనుందని సినీ సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్