`కేజీఎఫ్‌2` బ్యానర్‌లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీ.. అఫీషియల్‌

Published : Apr 27, 2022, 05:54 PM IST
`కేజీఎఫ్‌2` బ్యానర్‌లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీ.. అఫీషియల్‌

సారాంశం

లెజెండరీ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ గ్రాండ్‌ సన్‌, రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ సినీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని బుధవారం ప్రకటించారు. 

శాండల్‌వుడ్‌ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నారు. మూడో తరం నటన వారసుడి ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌ అయ్యారు. లెజెండరీ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ గ్రాండ్‌ సన్‌, రాజ్‌కుమార్‌ పెద్ద కుమారు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ సినీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని బుధవారం ప్రకటించారు. `కేజీఎఫ్‌`, `సలార్‌` చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని విడుదల చేయబోతున్నారు. తాజాగా యువ రాజ్‌కుమార్‌ లుక్‌తో ఈ సినిమాని ప్రకటించారు. 

`రాజకుమారా`, `మిస్టర్‌ అండ్‌ మిస్‌ట్రెస్‌ రామాచారి` వంటి చిత్రాలను రూపొందించిన సంతోష్‌ ఆనంద్రామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో యువరాజ్‌కుమార్‌ స్టయిలీష్‌గా,  ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. కన్నడ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీలో పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ లేని లోటుని యువరాజ్‌కుమార్‌ తీర్చబోతున్నాడనే సంకేతాలను ఫ్యాన్స్ కి ఈ లేటెస్ట్ లుక్‌ ఇవ్వబోతుండటం విశేషం. 

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ నట వారసులుగా రాణిస్తున్నారు శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌. అయితే గతేడాది పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ నటిస్తున్నారు. వీరి అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ మొదట్లో ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. కానీ ఆయనసినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు. యాక్టింగ్‌ ఆయనకు కలిసి రాలేదు. దీంతో దూరంగా ఉన్నారు. నిర్మాణం వైపు బిజీగా ఉన్నారు. తాను చేయలేనిది తన కుమారుడు యువరాజ్‌కుమార్‌తో చేయించబోతున్నారని చెప్పొచ్చు.  అయితే ఈ కొత్త సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్