నా ఫస్ట్ సినిమా రిలీజ్ కూ ఇంత నెర్వస్ లేదు.. ‘దసరా’ విషయంలో నాని ఆసక్తికర కామెంట్స్..

By Asianet News  |  First Published Mar 27, 2023, 7:36 PM IST

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రెండు రోజుల్లో తన తొలి పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. 
 


రోటీన్ కు భిన్నంగా చిత్రాలు చేస్తూ.. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు నాని. ఈ క్రమంలో డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని ఏకంగా పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు.  అదే దసరా చిత్రం.  ఊరమాస్ లుక్ లో నెవర్ బిఫోర్ గా నాని అలరించబోతున్నాడు. బలమైన కథను ఎంచుకున్నామని, సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రమోషన్స్ లో ధీమా వ్యక్తం చేశారు. రెండ్రోజుల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండటంతో ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. 

ఈ సందర్భంగా నాని ఢిల్లీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..  నేను మళ్లీ డెబ్యూ ఫిల్మ్ చేస్తున్న ఫీలింగ్ వస్తోంది. మీరు (ఆడియెన్స్) ఎప్పుడూ కొత్త విషయాలను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. Dasara  విడుదలకు రెండు రోజులే మిగిలి ఉంది. ప్రస్తుతం నాకు కాస్తా టెన్షన్ మొదలైంది. 2011లో విడుదలైన నా మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ రిలీజ్ అప్పుడు కూడా ఇంత నెర్వస్ గా ఫీలవ్వలేదు. ‘దసరా’ విషయంలో కాస్తా నెర్వస్ గా ఉంది.‘ అంటూ ఇంట్రెస్టింగ్ గాకామెంట్స్ చేశారు. 

Latest Videos

అలాగే కొత్త సినిమాలు, మంచి సినిమాలు చేయడానికి సినిమా పట్ల ప్రేమ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ఒక్కోసారి కొత్త సినిమాల ప్రయోగాలు వర్కౌట్ అవుతాయని, కొన్నిసందర్భాల్లో ఫలితం వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆడియెన్స్ నిర్ణయిస్తారని, తప్పకుండా నచ్చే సినిమాలే చేస్తున్నట్టు వెల్లడించారు. మనమే ప్రేక్షకులమని మనం (కళాకారులు) అర్థం చేసుకోవాలి, ప్రేక్షకులు ప్రత్యేక సమూహమేమీ కాదన్నారు. మంచి సినిమా తీస్తే బాక్సాఫీస్ వసూళ్లు ఆటోమేటిక్‌గా వస్తాయని, ముందుగా ఆడియెన్స్  హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలన్నారు. 

నాని కేరీర్ లోనే తొలిసారిగా పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం గ్రాండ్ గా మార్చి 30న విడుదల కానుంది. 29 ప్రీమియర్స్ పడనుంది. దీంతో చిత్ర యూనిట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. నాని మాత్రం ప్రమోషన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.  

click me!