
‘నేను లోకల్’తో కలిపి వరుసగా ఆరు హిట్లు కొట్టాడు హీరో నాని. ఆ ఆరింట్లో ‘మజ్ను’ కూడా ఒకటి. సినిమా ఇక్కడ బాగానే ఆడింది. ఈ చిత్రాన్నే ఇప్పుడు మలయాళంలోకి అనువాదం చేస్తున్నారు. మలయాళ నిర్మాత జీపీ సుధాకర్ ఈ చిత్రాన్ని కేరళలో విడుదల చేస్తున్నాడు.
ఇప్పటికే మళయాళంలో నాని ‘మజ్ను’ మూవీ ఆడియో కూడా రిలీజైపోయింది. నాని నటించిన సినిమాల్లో దీని కంటే పెద్ద హిట్లు ఉన్నా.. అనువాదం కోసం ‘మజ్ను’నే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే... ఈ సినిమాతో మలయాళ ప్రేక్షకులకు కొంచెం దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ చిత్ర కథానాయిక అను ఇమ్మాన్యుయెల్ మలయాళ అమ్మాయే. ఆల్రెడీ అక్కడ మంచి పేరు సంపాదించింది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్నందించిన గోపీసుందర్ అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి నేటివిటీ ఇబ్బంది కూడా పెద్దగా ఉండదు. అందుకే ‘మజ్ను’ను మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు.
వరుసగా హిట్లు కొడుతూ తనపని తాను కూల్ గా చేసుకుంటూ పోతున్న నాని ఈ సినిమాతో మళయాళంలో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.