
దేవర చిత్రంతో ఫుల్ బిజిగా ఉన్న ఎన్టీఆర్ తన కెరీర్ ని ప్యాన్ ఇండియా స్దాయిలోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ స్దాయి చిత్రాలకే ఓకే చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమాకు ప్రిపేర్ అవుతూ ,మరో ప్రక్క హిందీలో వార్ 2 చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ రీసెంట్ గా మరో కథ విని ఓకే చేసినట్లు సమాచారం.
ఆ డైరక్టర్ మరెవరో కాదు...నేచురల్ స్టార్ నాని, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'హాయ్ నాన్న' తో పరిచయమైన శౌర్యువ్. అతను ఎన్టీఆర్ కోసం ఓ కథ రెడీ చేసి చెప్పారట. అది ఎన్టీఆర్ కు బాగా చెప్పి ఫైనల్ డ్రాఫ్ట్ తీసుకురమ్మని పురమాయించారట. భారీ బడ్జెట్ తో రూపొందే ఆ సినిమా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగితే వచ్చే సంవత్సరం అక్టోబర్ లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. హాయ్ నాన్న నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ వారే ఈ సినిమాని భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటన్న చిత్రం ఎన్టీఆర్ దేవర. ప్రభాస్ కల్కి వచ్చేసింది. పుష్ప విషయానికి వస్తే ఆగస్ట్ 15కు వస్తుందనుకుంటే రకరకాల కారణాలతో వాయిదా పడింది. దాంతో జనం దృష్టి పూర్తిగా దేవర పైకి మళ్ళింది. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావటం, ఇప్పటికే బయిటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ క్లిక్ అవటంతో బిజినెస్ వర్గాల్లో ‘దేవర’హాట్ కేక్ లా మారింది. దాంతో ఫ్యాన్సీ ఆఫర్స్ తో దేవర ముందు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.