నిర్మాతలని, దర్శకుడిని భయపెట్టారు.. నాని!

Published : Jul 12, 2019, 06:54 PM IST
నిర్మాతలని, దర్శకుడిని భయపెట్టారు.. నాని!

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా గ్యాంగ్ లీడర్ చిత్రం గురించి నాని ఆసక్తిక్రమైన అప్డేట్ సోషల్ మీడియా ద్వారా అందించాడు. 

మైత్రి నిర్మాతలు, దర్శకుడు విక్రమ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయపడుతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు అనడం కంటే మీరు భయపెడుతున్నారు అనడం కరెక్ట్ అని నాని అభిమానులని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. గ్యాంగ్ లీడర్ సినిమా అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ వరుసగా కామెంట్స్ పెడుతున్న విషయాన్ని నాని ప్రస్తావించాడు. 

ప్రచార కార్యక్రమాలని మంచి సమయం చూసి ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఇన్నిరోజులు ఆగామని నాని తెలిపాడు. ఆ సమయం వచ్చేసింది. జులై 13 ఉదయం 11 గంటలకు గ్యాంగ్ లీడర్ ప్రీ లుక్ బయటకు రాబోతోంది. అందులో గ్యాంగ్ లీడర్ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఉండబోతున్నాయి అని నాని తెలిపాడు.  

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌