ఘనంగా పవన్ కళ్యాణ్ నిర్మాత మనవరాలి వివాహం!

Published : Jul 12, 2019, 06:06 PM IST
ఘనంగా పవన్ కళ్యాణ్ నిర్మాత మనవరాలి వివాహం!

సారాంశం

తెలుగు తమిళ భాషల్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఆర్ బి చౌదరి స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించారు. ఆర్ బి చౌదరి నిర్మాణంలో సినిమా వచ్చిందంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. 

తెలుగు తమిళ భాషల్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ఆర్ బి చౌదరి స్టార్ ప్రొడ్యూసర్ గా రాణించారు. ఆర్ బి చౌదరి నిర్మాణంలో సినిమా వచ్చిందంటే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. తాజాగా ఆర్ బి చౌదరి మనవరాలు పూజ వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. 

ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రవీణ్ అనే వరుడితో పూజ వివాహం జరిగింది. తమిళనాడు ప్రముఖ రాజకీయ నేతలు పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఈ వివాహానికి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. 

90వ దశకంలో తమిళ చిత్రాలతో ఆర్ బి చౌదరి నిర్మాతగా ఎదిగారు. ఆర్ బి చౌదరి తెలుగులో నిర్మించిన తొలి చిత్రం సుస్వాగతం. ఆ తర్వాత పవన్ తో మరోసారి అన్నవరం చిత్రాన్ని నిర్మించారు. సూర్యవంశం, గోరింటాకు, రాజా, సింహరాశి, శివరామరాజు లాంటి చిత్రాలు ఆర్ బి చౌదరి నిర్మించినవే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌