‘దసరా’ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ,లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్

By Surya PrakashFirst Published Mar 28, 2023, 11:44 AM IST
Highlights

 ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, సినిమాకి హైదరాబాద్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 


నేచురల్ స్టార్ నాని నెక్ట్స్ లెవిల్ కు చేరుకున్నారు. ఆయన  మొదటి పాన్-ఇండియన్ మూవీ దసరా. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని, తనేంటో ఇండస్ట్రీకి చూపాలని ఆశిస్తున్నాడు నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో మూవీ టీమ్ ఫుల్ బిజీగా ఉంది.

మరో ప్రక్క ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, సినిమాకి హైదరాబాద్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సింగిల్-స్క్రీన్ సినిమాస్, మల్టీప్లెక్స్‌లలో బుకింగ్‌లు ఓపన్ అయ్యాయి. చాలా షోలు ఇప్పటికే సేల్ అయ్యి హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ట్రేడ్ ని మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఆ లెక్కలు చూద్దాం.

 నైజాం (తెలంగాణ): రూ. 13.7 కోట్లు 
సీడెడ్ (రాయలసీమ): రూ. 6.5 కోట్లు..
 ఉత్తరాంధ్ర: రూ. 3.9 కోట్లు.. 
ఈస్ట్: రూ. 2.35 కోట్లు.. 
వెస్ట్: రూ. 2 కోట్లు.. 
గుంటూరు: రూ. 3 కోట్లు..
 కృష్ణా: రూ. 2 కోట్టు.. 
నెల్లూరు: రూ. 1.2 కోట్లు.. 
తెలంగాణ:+ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 34.65 కోట్లు
 కర్ణాటక: రూ. 2.85 కోట్లు.. 
ఇతర భాషల్లో .. రూ. 1.5 కోట్లు.. 
నార్త్ ఇండియాలో .. రూ. 5 కోట్లు.. 
ఓవర్సీస్ : రూ. 6 కోట్లు..
 వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లు ప్రీ రిలీజ్ బిజనెస్ జరిగింది.

అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 51 కోట్లు రాబట్టాలి.

ఓ రకంగా నాని ముందు పెద్ద టార్గెట్ ఉంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వాహబ్. సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. మార్చి 30, 2023న దసరా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

click me!