బిగ్ బాస్ ఓటింగ్ పై నాని కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 3:06 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా మారినప్పుడు కూడా నాని తనపై ఇంత నెగెటివిటీ వస్తుందని ఊహించి ఉండడు.. కానీ హౌస్ మేట్స్ విషయంలో అతడు పక్షపాతం చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చివరకు నాని ఈ విషయంపై ఓ పెద్ద లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే షో చివరికి వచ్చేసరికి విన్నర్ ఎవరనే విషయంపై అందరికీ ఓ అవగాహన వచ్చేసింది. దీంతో నానిపై ట్రోలింగ్ కాస్త తగ్గింది. అయితే ఈ షో గురించి నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మూడు నెలల్లో తన జీవితంలో ఎన్నడూ లేనంత ఒత్తిడికి గురైనట్లు చెప్పిన నాని.. ఇదే తన ఆఖరి సీజన్ అని ఇకపై బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించనని క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే బిగ్ బాస్ ఓటింగ్ పారదర్శకంగా జరుగుతుందా..? లేదా..? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయని ప్రశ్నించగా.. దానికి సమాధానంగా ''అంతా పారదర్శకంగానే  జరిగింది. హిందీ, తమిళ, తెలుగు బిగ్ బాస్ అన్ని భాషల ఓటింగ్స్ ఒకే ఏజెన్సీ చూసుకుంటుంది. షూటింగ్ జరిగే మూడు, నాలుగు గంటల ముందు మాకు రిజల్ట్ చెబుతారు. వెంటనే ఎలిమినేట్ అయ్యే వాళ్ల వీడియోలు రెడీ చేయాలి.

ఎవరు వెళ్లబోతున్నారనే విషయం తెలియదు కాబట్టి అందరి వీడియోలు రఫ్ గా కట్ చేసి పెట్టుకుంటాం. మాకు రిజల్ట్ తెలిసిన తరువాతే వీడియో ఫైనల్ చేసి అప్ లోడ్ చేయాలి'' అంటూ ఓటింగ్ ప్రాసెస్ గురించి చెప్పుకొచ్చాడు. అలానే ఒక కంటెస్టెంట్ గా హౌస్ లో అన్ని రోజులు తను ఉండలేనని వెల్లడించాడు. 

సంబంధిత వార్త.. 

బిగ్ బాస్3 హోస్ట్ చేస్తారా..? నాని ఏమన్నాడంటే!

click me!