'టక్‌ జగదీష్'లో నానికి అరుదైన మానసిక సమస్య?

Published : Aug 09, 2020, 03:31 PM IST
'టక్‌ జగదీష్'లో నానికి అరుదైన మానసిక సమస్య?

సారాంశం

బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.

‘నిన్ను కోరి’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్‌  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని చేస్తున్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందిట. సినిమాలో ఒక బైపోలార్ డిజార్డర్ క్యారెక్టర్ లో నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

 బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.
 
 అలాగే ఈ సినిమాలో ...నాని వాళ్లు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు. వాళ్లల్లో మధ్యవాడికిగా కనిపించే నానికి సినిమాలో టక్ జగదీష్ అనేది నిక్ నేమ్ అని తెలుస్తోంది. టక్ చేయటం అనేది ఓ టైమ్ లో చాలా పెద్ద ఫ్యాషన్. అంటే ఈ సినిమా కథ కూడా ఎనభైల్లోనో, తొంబైల్లోనో జరగనుందన్నమాట. అందుకే టక్ జగదీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసారట.  

 షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. నాని కెరీర్‌ లో బెస్ట్ గా నిలిచిన  ఎవడే సుబ్రమణ్యం సినిమాలో  నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తూండటంతో ఇంట్రస్టింగ్ గా  మారింది. 
 
PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?