మరిచిపోలేని పాత్రలేన్నో చేయాలి.. మహేష్‌కి చిరు స్వీట్‌ విశేష్‌

Published : Aug 09, 2020, 10:21 AM ISTUpdated : Aug 09, 2020, 11:48 AM IST
మరిచిపోలేని పాత్రలేన్నో చేయాలి.. మహేష్‌కి చిరు స్వీట్‌ విశేష్‌

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి సైతం విశెష్‌ తెలిపారు. `అందం, అభినయం, భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్‌బాబు. ఈ ఏడాది మీకు బాగుండాలి` అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

మహేష్‌బాబు 45వ పుట్టిన రోజుని పురస్కరించుకుని సినీ ప్రముఖులు ఆయనకు విశెష్‌ చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో బర్త్ డే విశెష్‌ మోత మోగుతుంది. అనేక మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు సూపర్‌ స్టార్‌ మహేష్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

మెగాస్టార్‌ చిరంజీవి సైతం విశెష్‌ తెలిపారు. `అందం, అభినయం, భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్‌బాబు. ఈ ఏడాది మీకు బాగుండాలి` అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

చిరంజీవికి, మహేష్‌కి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ ఏడాది మహేష్‌ నటించిన `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి మెగాస్టార్‌ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గతంలో వీరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిరంజీవి తనకు ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌ అని మహేష్‌ పదే పదే చెబుతుంటారు. మహేష్‌ని చిరు తన అబ్బాయిగా భావిస్తుంటారు. తాజాగా మరోసారి తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉంటే అభిమానులు సోషల్‌ మీడియాలో `హ్యాపీ బర్త్ డే మహేష్‌` యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇది ట్విట్టర్‌లో ఏకంగా నాలుగు మిలియన్లని దాటి ట్రెండ్‌ అవుతుంది. అన్ని సామాజిక మాధ్యమాల్లో కలిపి ఇది 25 మిలియన్లని దాటడం విశేషం. ఇక ప్రస్తుతం మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి