నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘అంటే...సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్ నటిస్తోంది. ఈ చిత్రం కథ లీక్ అంటూ ఒక స్టోరీ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ కథేమిటంటే..
అప్పట్లో బాగ్యరాజా హీరో గా తమిళంలో వచ్చిన నేనూ మీవాడినే సినిమా ఘన విజయం సాధించింది. దాన్ని తెలుగులో అదిరింది అల్లుడు అంటూ మోహన్ బాబు,రమ్యకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కించారు. బ్రాహ్మణ కుటుంబంలోకి బ్రాహ్మణుడుని అంటూ ప్రవేశించి, ఆ ఇంటివారి అమ్మాయితో ప్రేమలో పడే కుర్రాడి కథ అది. ఇప్పుడు ఆ కథకు రివర్స్ లో జరిగే కథ తెలుగులో తెరకెక్కబోతోందని తెలుస్తోంది.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘అంటే...సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్ నటిస్తోంది. ఈ చిత్రం కథ లీక్ అంటూ ఒక స్టోరీ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ కథేమిటంటే..
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాని ఓ క్రీస్టియన్ అమ్మాయిని ప్రేమించడం జరుగుతుంది. తమ కుటుంబం పూర్తి స్దాయిలో బ్రాహ్మణ సంప్రదాయాలు, మడి ఆచారాలు ఫాలో అవుతూండటంతో నాని అంటే సుందరం ఇరుకున పడతాడు. తన ఇంట్లో ఈ విషయం చెప్తే రచ్చ రచ్చ అవుతుంది. దాంతో సుందరం(నాని) తను ప్రేమించిన ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణ అమ్మాయే అని కుటుంబంతో అని అబద్దమాడుతాడట. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చి తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. అక్కడ నుంచి అసలు ఫన్ ప్రారంభం అవుతుంది. క్రిస్టియన్ అయిన హీరోయిన్ నజ్రియాని బ్రాహ్మణురాలిగా చూపించటం చాలా కష్టం గా మారుతుంది. అడుగడుక్కి అవాంతరాలు. నజ్రియాకు బ్రాహ్మణ కుటుంబాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. దాంతో తమ పద్దతులు, భాష, యాస ఆచారాలు నేర్పేందుకు సుందరం నానా కష్టాలు పడడం అనే విషయాన్నీ వివేక్ ఆత్రేయ కామెడీగా చూపించబోతున్నాడట. ఇందులో నిజమెంత ఉందో కానీ ఈ కథ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
‘ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ నేపథ్యంలో అందరిని అలరిస్తుంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించే సినిమా ఇది’ అని చిత్ర టీమ్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, ప్రొడక్షన్ డిజైన్: లతా అరుణ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.