
గత ఏడాది వరసగా రెండు సినిమాలు ప్లాప్ కావడం.. అది కూడా థియేటర్లులో విడుదల కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో కాస్త డల్ అయిన నేచురల్ స్టార్ నానీ (Nani).. శ్యామ్ సింగరాయ్(Shyam Singh Roy) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
నానీ (Nani) మంచి దూకుడు మీద ఉన్నాడు. వరుస ప్లాప్ ల తరువాత రీసెంట్ గా శ్యామ్ సింగ్ రాయ్ తో హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్. ఈ ఊపులో నానీ అదే స్పీడ్ ను కంటీన్యూ చేయాలి అని చూస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ (Shyam Singh Roy) సౌత్ అన్ని బాషలలో విడుదల కావడం.. అన్ని చోట్ల మంచి మార్కులే పడడంతో ఇప్పుడు అదే ఊపులో తన సినిమాల లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం నానీ (Nani) తన కెరీర్ లో 28వ సినిమాగా అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమా చేస్తున్నాడు. పక్కా ఫన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానీ (Nani) డిఫెరంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎప్పుడు చిన్నప్పుడు చదువకున్న బారిస్టర్ పార్వతీశం గెటప్ కు దగ్గరగా ఉంది నానీ (Nani) గెటప్. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ కు ముస్తాబు చేయబోతున్నారు.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి స్టోరీ బేస్ట్ సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాని డైరెక్టర్ చేయగా.. మలయాళ బ్యూటీ నజ్రియా నానీ (Nani) సరసన హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి నుంచి మంచి అంచనాలను ఏర్పరుచుకున్న అంటే సుందరానికి (Ante Sundaraniki).. ఆడియన్స్ ను ఇంకా అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ మూవీ రిలీజ్ .. ప్రమోషన్స్ విషయంలో కూడా నానీ (Nani) డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు.
కొత్తగా ఈ సినిమాను ప్రమోట్ చేయాలని అనకున్నారు టీమ్. హీరో నానీ (Nani) అప్పుడే ఈ విషయంలో ముందడుగు వేశాడు. ట్రిపుల్ ఆర్ (RRR) లాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ రెండు రెండు రిలీజ్ డేట్లు ఇస్తూ.. ఏది వీలైయే అది తీసుకుంటామని పోస్టర్లు రిలీజ్ చేస్తుండటంతో... వారందరికి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు నానీ (Nani).. అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ పోస్టర్ ను నానీ (Nani) తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశాడు.
అది కూడా.. మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో ఓ పోస్టర్ ద్వారా ఈ ఏడు డేట్స్ ప్రకటించారు. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. అంతే కాదు అది సమ్మర్ కావడంతో.. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్.... మెల్లగా డిసైడ్ చేస్తాం అంటూ ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు నానీ (Nani).
నానీ (Nani) ఈ మధ్య ఎక్కకడా తగ్గడం లేదు. తన స్టైల్ లో కౌంటర్లు ఇస్తూ.. కామ్ గా ఏం జరుగుతుందో చూస్తూ కూర్చుంటున్నాడు. ఆమధ్య తన శ్యామ్ సింగరాయ్ (Shyam Singh Roy) సినిమా టైమ్ లో కూడా ఏపీ టికెట్ రేట్ల విషయంలో.. కిరాణ కొట్లతో పోల్చి.. సంచలనం అయ్యాడు. మంత్రులు....ఎమ్మెల్యేలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానీని నానా మాటలు అన్నా.. కామ్ గా వాటిని ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలకు గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. తన సినిమాకు 7 రిలీజ్ డేట్స్ ఇచ్చి.. అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాడు నేచురల్ స్టార్.