కాజల్‌కి యూఏఈ గోల్డెన్‌ వీసా.. డిటెయిల్స్

Published : Feb 03, 2022, 06:56 PM IST
కాజల్‌కి యూఏఈ గోల్డెన్‌ వీసా.. డిటెయిల్స్

సారాంశం

యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్‌ వీసా కాజల్‌ పొందడం విశేషం. ఈ విషయాన్ని కాజల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. తన సంతోషాన్ని పంచుకుంది. యూఏఈలో ఉండేందుకు కాజల్‌కి ఈ వీసా లభించడం విశేషం. 

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ కి అరుదైన వీసా లభించింది. యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్‌ వీసా కాజల్‌ పొందడం విశేషం. ఈ విషయాన్ని కాజల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. తన సంతోషాన్ని పంచుకుంది. యూఏఈలో ఉండేందుకు కాజల్‌కి ఈ వీసా లభించడం విశేషం. యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్‌ కన్సల్టేషన్‌ సంస్థ ద్వారా ఈ గోల్డెన్‌ వీసాని పొందింది కాజల్‌. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధి మహమద్‌ షానిద్‌ అసిఫలి చేతుల మీదుగా కాజల్‌ ఈవీసాని అందుకుంది. తన సంతోషాన్ని పంచుకుంది. 

ఇందులో కాజల్‌ చెబుతూ, యూఏఈ గోల్డెన్‌ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు యూఏఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా యూఏఈకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ దేశంతో మున్ముందు కలిసి పనిచేయాలని, భవిష్యత్‌ సహకారాల కోసం ఎదురుచూస్తున్నా` అని పేర్కొంది కాజల్‌. ఈ సందర్భంగా జుమా అల్మ్‌ హిరీ సంస్థ ప్రతినిధి మహమ్మద్‌ షానిద్‌కి, సురేష్‌ పున్నసెరిల్‌, నరేష్‌ క్రిష్టలకు కృతజ్ఞతలు తెలిపింది కాజల్‌. 

ఇక కాజల్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. కాజల్‌ ప్రెగ్నెంట్‌ అయినట్టు ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. బేబీ బంప్స్ తో కాజల్‌ సైతం ఫోటోలకు పోజులిచ్చి అభిమానులను అలరించింది. ఆ తర్వాత కూడా తన గ్లామర్‌ పిక్స్ తో అలరిస్తుంది. మరోవైపు ఇటీవల ఆమె వెకేషన్‌లో ఎంజాయ్‌ చేసిన విసయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె పంచుకున్న పిక్‌ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. 

కెరీర్‌ పరంగా కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ అవుతూ వచ్చారు. తమిళంలో `హే సినామికా`, తెలుగులో `ఆచార్య` చిత్రాలు చేశారు. దీంతోపాటు నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రానికి కూడా కమిట్‌ కాగా, ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ కావడంతో ఆ చిత్రం నుంచి తప్పుకుంది. మరోవైపు ఇప్పటికే ఆమె తమిళంలో `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హిందీలో `ఉమా` చిత్రాలు పూర్తి చేసుకుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి