Ante Sundataniki : అంటే సుందరానికీ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ టాక్ ఏంటంటే?

Published : Jul 04, 2022, 01:52 PM IST
Ante Sundataniki : అంటే సుందరానికీ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ టాక్ ఏంటంటే?

సారాంశం

నేచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు అందాయి. 

నేచురల్ స్టార్ నాని (Nani), మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ మూవీకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అత్రేయా దర్శకత్వం వహించారు. గత నెల 10న మూవీ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ డే తర్వాత తొలివారం కలెక్షన్ల పరంగా కాస్తా పర్లేదు అనిపించినా.. తర్వాత మాత్రం కంప్లీట్ పూర్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమా నిలిచినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. తొలి మూడు రోజుల్లోనే రూ.15 కోట్ల మేర వసూళ్లు చేసిన  అంటే సుందరానికీ.. మొత్తంగా రూ.30 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

ఏరియాల వారీగా అంటే సుందరానికీ  సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో - రూ 6.22 కోట్లు, సీడెడ్ - రూ 1.32 కోట్లు, మొత్తం AP/TS కలిపి రూ. 13.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ 1.70 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో మాత్రం రూ 5.78 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రూ. 21.22 కోట్ల షేర్లు మాత్రమేనని తెలుస్తోంది.కనీసం బ్రేక్ ఈవెన్ రూ 31 కోట్లను ఈ చిత్రం చేరుకోలేకపోయిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 68 శాతం మాత్రమే రికవరీ చేసి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా నిలిచింది. 

ఒక సారి ఈ చిత్రం రోజు వారీ కలెక్షన్లు చూస్తే.. తొలి రోజు రూ. 3.87 కోట్లు, రెండో రోజు రూ. 3.48 కోట్లు, మూడో రోజు రూ. 3.05 కోట్లు, నాల్గో రోజు రూ. 71 లక్షలు, ఐదో రోజు రూ. 46 లక్షలు, ఆరో రోజు రూ. 30 లక్షలు, ఏడో రోజు రూ.18 లక్షలు, ఎనిమిదో రోజు రూ.11 లక్షలు,  తొమ్మిదో రోజు రూ. 15 లక్షలు, పదో రోజు రూ. 67 లక్షలు,  11వ రోజు  రూ. 21 లక్షలు, 12వ రోజు రూ. 16 లక్షలు, 13వ రోజు రూ. 11 లక్షలు, 14వ రోజు రూ. 7 లక్షలు, మిగిలిన రోజుల్లో రూ. 21 లక్షల షేర్ వసూళ్లు చేసింది. ఏపీ తెలంగాణలో మొత్తం రూ. 13.74 కోట్ల షేర్ మాత్రమే వసూల్ చేసింది.

ఈ చిత్రంలో బ్రాహ్మణ అబ్బాయికిగా నాని, క్రిస్టియన్ అమ్మాయిగా నజ్రియా చక్కగానే నటించారు. అయితే సినిమాలోని కొన్ని ల్యాగ్ సీన్లతో కాస్తా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్రంలో నిక్కి తంబోలి, పృథ్వీ రాజ్, నరేష్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, అలాగే హర్ష వర్ధన్, నదియా, శ్రీకాంత్ అయ్యంగార్ పలు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. వివేకర్ సాగర్ సంగీత అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్