
ఇటీవల కాలంలో సినీ హీరోయిన్ లకు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది . తాజాగా విడాకులు తీసుకుంటున్న హీరోయిన్ ల జాబితాలోకి నందితా దాస్ కూడా చేరింది. భర్త తో ఏడేళ్ల పాటు కాపురం చేసిన తర్వాత ఆరేళ్ళ బాబు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య అంతరాలు పెరిగిపోయాయి. దీంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట ఈ జంట. ఈ విషయాన్నీ స్వయంగా నందితా దాస్ వెల్లడించింది.
నందితా దాస్ గతంలోనే 2002లో మొదట సౌమ్య సేన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాదాపు అయిదున్నర సంవత్సరాలు అతనితో కాపురం చేసింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2007 లో అతడికి విడాకులు ఇచ్చింది నందిత.
ఇక శుభోద్ మస్కారాని పెళ్లి చేసుకున్నాక ఇన్నేళ్లు బాగానే ఉన్నారు . వాళ్ళ ప్రేమకు ప్రతి రూపంగా ఆరేళ్ళ బాబు కూడా ఉన్నాడు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో కలహాల కాపురం చేసే బదులు విడిపోయి తనయుడి పట్ల బాధ్యతగా మసులుకుందాం అని నిర్ణయించుకున్నారట అందుకే డైరెక్ట్ గా అందరికీ చెప్పేస్తోంది నేను విడాకులు తీసుకుంటున్నాను అంటూ .