
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారక రత్న రాజకీయాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించాలనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆయనకి గుండె సమస్య తీవ్రంగా మారడంతో మరణం సంభవించింది.
తారక రత్న పిన్న వయసులోనే దూరం కావడంతో కుటుంబ సభ్యులు,అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. తారకరత్న జ్ఞాపకాలని సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల తారకరత్న ఆర్థిక స్థితిపై కొన్ని ప్రచారాలు జరిగాయి. తారకరత్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, కుటుంబ సభ్యులు సాయం చేసారని కూడా వార్తలు వచ్చాయి.
అది అవాస్తవం అంటూ ఇప్పుడు తెరపైకి కొత్త ప్రచారం వచ్చింది. తారకరత్న సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తారకరత్నకి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు లేవు అని అంటున్నారు. ఎందుకంటే తారక రత్నకి వారసత్వంగా వందల కోట్ల ఆస్తులు వచ్చాయట.
అంతే కాదు తారక రత్న రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఏపీలో నాలుగు క్వారీలలో కూడా తారకరత్న పెట్టుబడులు పెట్టారట. వీటి ద్వారా తారకరత్నకి ఆదాయం బాగానే వస్తుంది అని చెబుతున్నారు. గతంలో తారకరత్నకి బంజారాహిల్స్ లో రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉండేది.
అలాగే తారకరత్నకి నాలుగు బ్లాక్ కార్ల కాన్వాయ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి తారకరత్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరమే లేదని అంటున్నారు. తారకరత్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారట.
తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న కెరీర్ ఆరంభంలో మంచో జోరే ప్రదర్శించాడు. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అయ్యాడు. ఫలితంగా తారకరత్న హీరోగా పూర్తి స్థాయిలో రాణించలేదు.