
నందమూరి వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఫిలింనగర్‌లోని నివాసంలో ఆమె మృతి చెందినట్లు సమాచారం. పద్మజ నందమూరి హీరోలలో ఒకరైన చైతన్య కృష్ణ మాతృమూర్తి. రాజమండ్రి ఎంపీ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త, ప్రముఖ రాజకీయ నాయకుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయాన సోదరి .
పద్మజ మరణ వార్త నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణవార్త విని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు విషయం తెలుసుకుని వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు.ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉన్న నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు అంతా హైదరాబాద్ బయదులేరినట్టు సమాచారం. ఇక అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఇప్పటికే ఒకొక్కరుగా జయకృష్ణ నివాసానికి చేరుకొంటున్నారు.