‘బింబిసార 2’ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారంటే?

By Asianet News  |  First Published Feb 9, 2023, 2:23 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ‘బింబిసార’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్ట్ 2పై తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
 


టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’ గతేడాది విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’ మంచి హిట్ ను సాధించిపెట్టింది. దీంతో ఒక్కసారిగా కళ్యాణ్ రామ్ ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో వరుస ప్రాజెక్ట్స్ ను ప్రేక్షకులను ముందుకు తీసుకు వచ్చేందుకు  ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ (Amigos) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఫిబ్రవరి 10 (రేపే)న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రినభినయంతో అలరించబోతున్నారు. మూడు క్యారెక్టర్లలో ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుంటున్నారు. దీంతో సినిమాపై హైప్ పెరుగుతోంది. మరోవైపు చిత్ర యూనిట్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ సైతం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘బింబిసార 2’పై  ఇంట్రెస్టింగ్ అప్డెట్ అందించారు.

Latest Videos

‘బింబిసార’ పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో అభిమానులు, ప్రేక్షకులు Bimbisara2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలిపారు. ప్రస్తుతం ‘అమిగోస్’ విడుదలపైనే ఫోకస్ ఉందన్నారు. ఇక నెక్ట్స్ Devil చిత్రం రానుందని తెలిపారు. ఈచిత్రం ఇప్పటికే 70 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుందని తెలిపారు. ఈఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత.. అంటే ఈ ఏడాది చివర్లలోనే ‘బింబిసార2’ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. 

మరోవైపు ‘బింబిసారా 2’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్ట్ 2 మరింత హైలెవల్లో ఉంటుందని మేకర్స్ కూడా చెబుతున్నారు. చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కేథరిన్ ట్రెసా,  సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్ నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. చిరంతన్ భట్, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యానికి చెందిన రాజు బింబిసారుడు చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం నాలుగు పార్టులుగా రానుందని తెలుస్తోంది. 
 

click me!