బయటపడ్డ సింగర్ యశస్వి మోసం!

Published : Feb 09, 2023, 12:23 PM ISTUpdated : Feb 09, 2023, 12:28 PM IST
బయటపడ్డ సింగర్ యశస్వి మోసం!

సారాంశం

పైకి సాఫ్ట్ గా కనిపోయించే సింగర్ యశస్వి నేరప్రవృత్తి బయటపడటంతో అందరూ షాక్ అవుతున్నారు. సింగర్ యశస్వి ఇలాంటి వాడా అని వాపోతున్నారు. 

సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ విన్నర్ యశస్వి కొండెపూడి స్వచ్చంధ సంస్థ పేరున మోసం చేశాడు. నవసేవ పేరుతో ఎన్జీవో నడుపుతున్నట్లు పలుమార్లు టీవీ వేదికలపై వెల్లడించారు. ఆ సంస్థ పేరున పేద విద్యార్థులను చదివిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాజాగా నవసేవ ఎన్జీవో నిర్వాహకురాలు ఫరా కౌసర్ కీలక విషయాలు వెల్లడించారు. యశస్వి చెబుతున్నవన్నీ అబద్ధాలని తేల్చేశారు. నవసేవ ఎన్జీవో తో ఆయన ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. 

ఇటీవల ఒక టెలివిజన్ షోలో  పాల్గొన్న యశస్వి నవసేవ ఎన్జీవో తరపున కొంతమంది చిన్నారులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింగర్ యశస్వి మాటలను ఆమె ఖండించారు. యశస్వి చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదని నవసేవ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలో గల ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడారు. యశస్వి తాను చేయని సేవను చేసినట్లు చెప్పుకుంటున్నాడు. జనాల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 

దీంతో యశస్వి మోసం బయటపడింది. ఈ క్రమంలో నవసేవ ఎన్జీవో పేరిట యశస్వి వసూళ్లకు పాల్పడ్డాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక ఫరా కౌసర్ ఆరోపణలకు యశస్వి స్పందిస్తాడా? వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడా లేదా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. జీ తెలుగు సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్ గా యశస్వి పాప్యులర్ అయ్యారు. జాను చిత్రం నుండి ఆయన పాడిన రొమాంటిక్ సాంగ్ ఫేమ్ తెచ్చిపెట్టింది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..