బుధవారం రోజు షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు చిత్ర యూనిట్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అదిరిపోయే పోస్టర్ తో ప్రకటించారు. పోస్టర్ లో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న గొడ్డలిని ఉంచారు. ఈ పోస్టర్ పై బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయెలెన్స్ కా విజిటింగ్ కార్డు అంటూ అదిరిపోయే డైలాగులు ఉన్నాయి.
అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్స్ తర్వాత బాలయ్య నటించే తదుపరి చిత్రంపై అంచనాలు తప్పకుండా పీక్స్ కి వెళతాయి. అలాంటి బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడైతే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.
అదే ఊపులో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా నేడు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ వచ్చేసింది. నేడు బుధవారం రోజు షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు చిత్ర యూనిట్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అదిరిపోయే పోస్టర్ తో ప్రకటించారు.
Blood Bath Ka Brand Name 🩸
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂 𝑽𝑰𝑺𝑰𝑻𝑰𝑵𝑮 𝑪𝑨𝑹𝑫 🪓👓 Shoot begins today!! 📽️
Beginning a new journey with our Natasimham garu 😍
I seek your blessings and support, as always. 🙏❤️ 💥… pic.twitter.com/bYl7izkWAB
పోస్టర్ లో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న గొడ్డలిని ఉంచారు. గొడ్డలిపై మెడలో లాకెట్, రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి. ఈ పోస్టర్ పై బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయెలెన్స్ కా విజిటింగ్ కార్డు అంటూ అదిరిపోయే డైలాగులు ఉన్నాయి. దీనితో సినిమా టోన్ ఏంటో డైరెక్టర్ బాబీ చెప్పకనే చెప్పారు. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎంటర్టైనర్ నే బాబీ తెరకెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది. గొడ్డలిపై ఉన్న గ్లాసెస్ పైతాండవం చేస్తున్నట్లుగా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. అవి కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు.ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి #NBK109 అనే టైటిల్ పెట్టారు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.